'కుక్క' చనిపోయిందని 'అతను 'ఆత్మహత్య చేసుకొన్నాడు
తాను అల్లారు ముద్దుగా పెంచుకొన్న కుక్క చనిపోయిందని భాదతో 2 ఏళ్ళ విధ్యార్థి భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన పూణెలో చోటుచేసుకొంది,
పూణె :కుక్క అంటే విశ్వాసం గల జంతువు అని పేరుంది. యజమానికి కుక్క విశ్వాసం గా ఉంటుంది.అయితే ప్రాణప్రదంగా పెంచుకొన్న ఓ కుక్క చనిపోయిందనే భాదతో ఓ యువకుడు ఆత్మహత్యచేసుకొన్నాడు. ఈ ఘటన ఫూణెలో చోటుచేసుకొంది.
ఛత్తీస్ ఘడ్ కు చెంిన హర్షవర్థన్ రాఘవ్ అనే యువకుడు పూణెలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. రాఘవ్ తండ్రి ఆర్మీలో పనిచేస్తాడు. చిన్నతనం నుండి రాఘవ్ కుక్కను పెంచుకొంటున్నాడు.

ఇంటి వద్ద ఉంటే ఎక్కువ సేపు కుక్కతోనే గడిపేవాడు.అయితే అల్లారుముద్దుగా పెంచుకొన్న కుకక్క అనారోగ్యంతో ఎనిమిది మాసాల క్రితం చనిపోయింది.ఈ కుక్క చనిపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆ కుక్క గురించే కుటుంబీకులతో చర్చించేవాడు.
పూణెలోని సింబయాసిస్ కాలేజీలో మేనేజ్ మెంట్ తొలి సంవత్సరం చదువుతున్నాడు రాఘవ్. రెండేళ్ళుగా పూణెలో ఉంటున్నాడు. తాను పెంచుకొన్న చనిపోవడంతో మనస్థాపానికి గురైన రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు రాసి పెట్టాడు.
తాను ఉంటున్న ఫ్లాట్ లోని ఆరో అంతస్థు నుండి కిందకు దూకాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.












Click it and Unblock the Notifications