Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug case: బ్యూటీ సంజనా దెబ్బ, టాప్ లీడర్ కొడుకు, ఫేమస్ మాల్ యజమాని, సినీ నిర్మాతల విచారణ!

బెంగళూరు/మంగళూరు/ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్, బహుబాష నటి సంజనా గల్రానీ కహానీ రోజుకో మలుపు తిరుగుతోంది. సంజనా మేడమ్ తో ఆర్థికలావాదేవీలు నిర్వహించిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు, ఫేమస్ మాల్ యజమాని, సినీ నిర్మాత దంపతులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. సంజనాతో మీకు ఏమిటి లింక్ ? ఆమె బ్యాంక్ అకౌంట్ లు, మీ బ్యాంక్ అకౌంట్ లకు ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిగాయి ?, అసలు ఏమిటి కథ ? అంటూ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వారిని విచారణ చేస్తున్నారు.

 కాంగ్రెస్ ఎమ్మెల్సీ కొడుకు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కొడుకు

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన సంజనా గల్రానీతో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడికి లింక్ ఉందని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ యుబి. వెంకటేశ్ కుమారుడు, ప్రముఖ వ్యాపారి అయిన గణేష్ రావ్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

రాయల్ మీనాక్షి మాల్ యజమాని

రాయల్ మీనాక్షి మాల్ యజమాని


ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రావ్ బెంగళూరు సిటీలోని ఫేమస్ మాల్ గా గుర్తింపు పొందిన రాయల్ మీనాక్షి మాల్ యజమాని. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి సంజనా గల్రానీతో వ్యాపారవేత్త గణేష్ రావ్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. నటి సంజనా బ్యాంక్ అకౌంట్ ల నుంచి వ్యాపారవేత్త గణేష్ రావ్ బ్యాంకు ఖాతాలకు లక్షల రూపాయలు నగదు బదిలీ అయ్యిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు గుర్తించారు.

సమన్లు జారీ, వెంటనే విచారణ

సమన్లు జారీ, వెంటనే విచారణ


ప్రముఖ వ్యాపారవేత్త, రాయల్ మీనాక్షి మాల్ యజమాని గణేష్ రావ్ కు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు హాజరైన వ్యాపారవేత్త గణేష్ రావ్ విచారణ ఎదుర్కొన్నారు.

మేడమ్ తో మీకు ఏమిటి సంబంధం ?

మేడమ్ తో మీకు ఏమిటి సంబంధం ?

స్యాండిల్ వుడ్ క్వీన్, బహుబాష నటి సంజనాతో మీకు ఏమిటి డీలింగ్ ? అనే విషయంపై అధికారులు అడిగిన ప్రశ్నలకు గణేష్ రావ్ వివరణ ఇచ్చారని తెలిసింది. ఆమె సినీ నటి, మీరు వ్యాపారవేత్త, మీ మద్యలో ఎందుకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి ?, అసలు విషయం ఏమిటి ?, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి ? అని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు గణేష్ రావ్ ను ప్రశ్నించి వివరాలు సేకరించారని సమాచారం.

 సినీ నిర్మాత దంపతులు

సినీ నిర్మాత దంపతులు


డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి సంజనా వ్యవహారం విషయంలో ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ తో పాటు ఆయన సతీమణిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు. సినీ నిర్మాత సౌందర్య జగదీష్ రామ్ లీలా అనే సినిమాను నిర్మించారు. రామ్ లీలా సినిమాలో నటి సంజనా గల్రానీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     రామ్ లీలా కోసం ఎంత ఇచ్చారు ?

    రామ్ లీలా కోసం ఎంత ఇచ్చారు ?


    పోలీసు అధికారుల విచారణ తరువాత సినీ నిర్మాత సౌందర్య జగదీష్ దంపతులు బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రామ్ లీలా సినిమాలో నటించినందుకు మీరు సంజనా గల్రానీకి ఎంత మొత్తంలో పారితోషికం చెల్లించారు అని మాత్రమే మమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ప్రశ్నించారని, వేరే విషయాలు ఏమీ అడగలేదని సినీ నిర్మాత సౌందర్య జగదీష్ దంపతులు మీడియాకు చెప్పారు. మొత్తం మీద జైల్లో ఉన్న నటి సంజనా దెబ్బకు ఎప్పుడు ఎవరిని పిలిచి విచారణ చేస్తారో ? అనే ఆందోళనతో ఆమెతో ఇంతకాలం టచ్ లో ఉన్న సన్నిహితులు హడలిపోతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+