Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: మతం మార్చుకున్న నటి సంజనా ?, పేరు మహిరా, లవ్ జీహాద్ దెబ్బ, లవర్ అజీజ్ మాయ !

బెంగళూరు/ ముంబాయి/ లక్నో: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రాని మతం మార్చుకున్నారు ? అనే ఆరోపణలు మొదలైనాయి. స్యాండిల్ వుడ్ చిత్రపరిశ్రమకు డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉంది ? అనే ఆరోపణలు మొదలైనప్పటి నుంచి నటి సంజనా, మరో హనీబ్యూటీ రాగిణి దివ్వేది పేర్లు తెరమీదకు రావడం, ఆ ఇద్దరు అరెస్టు అయ్యి జైలుకు పోవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు నటి సంజనాపై మరో ఆరోపణ తెరమీదకు వచ్చింది. లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా మతం మార్చుకుని ఆమె పేరును మహిరాగా మార్చుకున్నారని ప్రముఖ ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చెయ్యడంతో ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు. లవ్ జీహాద్ లో భాగంగా లవర్ అజీజ్ దెబ్బతో నటి సంజనా మతం, ఆమె పేరు మార్చుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపింది.

 సంజనా అలియాస్ మహిరా !

సంజనా అలియాస్ మహిరా !

స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా మీద మొదటి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 2018లో నటి సంజనా హిందూ మతం మారిపోయారని ప్రశాంత్ సంబర్గి ఆరోపిస్తున్నారు. 2018లోనే నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును మహిరా గా మార్చుకున్నారు ? అని ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

 క్రైమ్ బ్రాంచ్ చార్జ్ షీట్ లో ఏ పేరు ఉందంటే ?

క్రైమ్ బ్రాంచ్ చార్జ్ షీట్ లో ఏ పేరు ఉందంటే ?

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు నటి సంజనా గల్రానీని అరెస్టు చేసి చార్జ్ షీటు తయారు చేసి కోర్టులో సమర్పించారు. వారం రోజులకు పైగా నటి సంజనాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్ షీటులో నటి సంజనా గల్రాని అని నమోదైయ్యిందని, మహిరా అనే పేరు ఎక్కడా లేదని వెలుగు చూసింది.

 స్వీటీ సంజనా, డాక్టర్ అజీజ్ లవ్ స్టోరీ

స్వీటీ సంజనా, డాక్టర్ అజీజ్ లవ్ స్టోరీ

స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్, నటి సంజనా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కారణంగా నటి సంజనా, డాక్టర్ అజీజ్ ల పెళ్లి వాయిదా పడింది.

 సంజనా కాదు మహిరా అని పిలవండి

సంజనా కాదు మహిరా అని పిలవండి

ప్రముఖ వ్యాపారి, ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి కొన్ని పత్రాలను ఫేస్ బుక్ లో పంచుకున్నారు. దరుల్ ఉలుమ్ షా వలివుల్లా అనే పేరుతో ఫేస్ బుక్ లో ఓ లేఖ పంచుకున్న ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఇక ముందు నటి సంజనా అలియాస్ అర్చనా మనోహర్ గల్రానిని ఆ పేర్లతో పిలవకూడదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించిందని, ఆమెను మహిరా అని పిలవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 పొలికల్ లీడర్ తో విదేశాలకు సంజనా టూర్ !

పొలికల్ లీడర్ తో విదేశాలకు సంజనా టూర్ !

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన నటి సంజనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన నటి సంజనాపై మొదటి నుంచి ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుతం బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ తో కలిసి నటి సంజనా శ్రీలంక టూర్ కు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో ?

    ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో ?

    నటి సంజనా వ్యవహారం ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో ? అనే విషయం అంతు చిక్కకపోవడంతో ఆమె అభిమానులు సన్నిహితులు అయోమయానికి గురౌతున్నారు. తాను మాత్రం సంజనా వ్యవహారం మొత్తం బయట పెడుతానని, ఆమె భాగోతం మొత్తం ప్రజలకు వివరిస్తానని ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి పదేపదే చెబుతున్నారు. మొత్తం మీద లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి మహిరాగా పేరు మార్చుకున్నారా ? లేదా ? అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+