Drug Mafia: ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ డ్రమ్ పగిలిపోయింది, రాత్రి డ్రగ్స్ సేల్స్ బాయ్, ప్రభుదేవా తో !

బెంగళూరు/ మంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ స్టార్ డ్రగ్స్ లింక్ కేసులో మరో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ డ్రమ్ పగిలిపోయింది. బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రముఖ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిన వ్యక్తి, ప్రముఖ టీవీ చానల్ లో డ్యాన్స్ ఇండియ డ్యాన్స్ అంటూ హంగామా చేసిన డ్యాన్స్ మాస్టర్ ను పక్కా వల వేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ మిక్స్ చేసిన మాత్రలు రాత్రి సేల్స్ బాయ్ లాగా విక్రయిస్తూ వాటిని ఉపయోగిస్తున్న డ్యాన్స్ మాస్టర్ ను విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనితో ఇంకా ఎవరెవరికి లింక్ ఉంది అంటూ విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో కలిసి ఈ డ్యాన్స్ మాస్టర్ బాలీవుడ్ సినిమా ABCDలో నటించాడు.

Recommended Video

    Famous Dance Master Kishore Shetty Taken Into Custody By Mangalore Police

    ప్రభుదేవా ABCD సినిమా

    ప్రభుదేవా ABCD సినిమా

    2013లో విడుదలైన బాలీవుడ్ సినిమా ABCD (Any Body Can Dance) సినిమాలో ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటించారు. ఏబీసీడీ సినిమాకు రెమో డిసౌజ దర్శకత్వం వహించడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో నటించారు. ABCD సినిమాలో ప్రభుదేవా, రెమో డిసౌజ, గణేష్ ఆచార్య, తదితరులు నటించారు. ABCD సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ బాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది.

    ఒక్కదెబ్బతో కిశోర్ ఫేమస్

    ఒక్కదెబ్బతో కిశోర్ ఫేమస్

    ప్రముఖ స్యాండిల్ వుడ్, బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ అమన్ అలియాస్ కిశోర్ శెట్టి కూడా ABCD సినిమాలో నటించాడు. ప్రభుదేవా, రిమో డిసౌజ తదితరులతో నటించిన డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ప్రముఖ హిందీ టీవీ చానల్ ZEE TV నిర్వహించిన డ్యాన్ ఇండియా డ్యాన్ రియాలిటీ సీజన్-2 లో పాల్గొన్న కిశోర్ శెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యాడు.

     పోయే కాలం వచ్చింది

    పోయే కాలం వచ్చింది

    బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో స్యాండిల్ వుడ్ స్టార్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, రవిశంకర్, వీరేన్ ఖన్నా, రాహుల్ తదితరులు అరెస్టు అయ్యి జైలుపాలైన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియాతో రాగిణి, సంజనాతో పాటు కొందరు సంగీత దర్శకులు, డ్యాన్స్ మాస్టర్స్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టిని మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు అరెస్టు చేశారు.

    డ్రగ్స్ మాత్రల సేల్స్ బాయ్

    డ్రగ్స్ మాత్రల సేల్స్ బాయ్


    సమాజంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ శెట్టికి మరో రూపం ఉందని పోలీసులు గుర్తించారు. డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి MDM మాత్రలు (Drugs) విక్రయిస్తున్నాడని పక్కా సమాచారం అందడంతో మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా ప్లాన్ తో అతన్ని అరెస్టు చేశారు.

    తెరమీదకు రోజుకో పేరు

    తెరమీదకు రోజుకో పేరు


    బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసు విషయంలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటీవల మంగళూరుకు వెళ్లిన డీజీపీ ప్రవీణ్ సూద్ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇదే సమయంలో డ్రగ్స్ దందా కేసులకు సంబంధించి ప్రముఖ టీవీ యాంకర్ అకుల్ బాలాజీతో పాటు మరో ముగ్గురికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా దందా కేసులో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి అరెస్టు కావడంతో అతని డ్రమ్ పగిలిపోతుందని తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+