ముంబై ఎయిర్ పోర్టులో డ్రగ్స్: సబ్బుల్లో 25కోట్ల విలువైన కొకైన్ పట్టుకున్న డీఆర్ఐ

ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు సబ్బు బిళ్ళలలో 2.58 కిలోల 25 కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

భారతదేశంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై డిఆర్ఐ, నార్కోటిక్స్ అధికారులు, ఎయిర్ పోర్ట్ లలో కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతున్నా డ్రగ్స్ దందా చాప కింద నీరులాగా సాగుతూనే ఉంది. తాజాగా ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఒక ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 2.58 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సబ్బుల్లో డ్రగ్స్ .. గుర్తించిన డీఆర్ఐ అధికారులు


భారతదేశంలోని ముంబైకి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందని ఇంటెలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇథియోపియా అడిస్ అబాబా నుండి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్ లో 12 సబ్బులను అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేసిన డిఆర్ఐ అధికారులు అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు.

25 కోట్ల విలువ చేసే కొకైన్ సోప్ బార్లు .. ఇద్దరు అరెస్ట్

25 కోట్ల విలువ చేసే కొకైన్ సోప్ బార్లు .. ఇద్దరు అరెస్ట్

25 కోట్ల విలువ చేసే కొకైన్ సోప్ బార్ల ద్వారా అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి, ఆ వ్యక్తితో పాటు అతనికి సహాయకుడిగా ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే అతను ఎక్కడి నుంచి డ్రగ్స్ ను ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు? ఎవరికి ఆ డ్రగ్స్ ను చేరవేయబోతున్నాడు? అన్నది డిఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే నెలలో ముంబై ఎయిర్ పోర్ట్ లో రెండో ఘటన

ఒకే నెలలో ముంబై ఎయిర్ పోర్ట్ లో రెండో ఘటన

ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెల ప్రారంభంలో కూడా అడిస్ అబాబా నుండి ముంబై కి వచ్చిన ఒక భారతీయ వ్యక్తి 3,360 గ్రాముల కొకైన్ ను అక్రమ రవాణా చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా డిఆర్ఐ అధికారులు ముంబై విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఇదే తరహాలో 33 కోట్ల 60 లక్షల విలువైన కొకైన్ ను గుర్తించారు. అధికారుల కళ్ళు కప్పి, ఎవరికి పట్టు పడకుండా ముంబై కేంద్రంగా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా ఇటీవల పట్టు పడుతున్న అనేక కేసులను బట్టి తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+