బాయ్‌ఫ్రెండ్‌తో మద్యం తాగి, యువతి వీరంగం(వీడియో)
న్యూఢిల్లీ: ఓ యువతి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా రోడ్డు పైన హంగామా సృష్టించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం రాత్రి జరిగింది. ఆమె తన హంగామాతో స్థానిక పోలీసులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చోటు చేసుకుంది.
మద్యం మత్తులోనే ఆ యువతి నడి వీధుల్లో నానా రభస చేసింది. అప్పుడు ఆమె వెంటే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె బాయ్‌ఫ్రెండుతో కలిసి మద్యం సేవించింది. ఆ తర్వాత యువతి తన ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుతో బైక్ పైన వెళుతున్న యువకులను ఢీకొట్టింది.
WATCH: Girl created ruckus in Delhi's Connaught Place last night after her car rammed into a bike.https://t.co/E3dRqB41QR
— ANI (@ANI_news) February 10, 2016
అంతేకాక తనను నిలువరించేందుకు యత్నించిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల పట్ల కూడా ఆమె అసభ్యంగా ప్రవర్తించింది. నడి రేయిలో దాదాపు మూడు గంటల పాటు ఆ యువతి చేసిన నానా రభసకు చెందిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications