బెంగళూరులో పీకలదాక మందు తాగింది, నడి రోడ్డులో కారు నిలిపి డ్యాన్స్ లు (వీడియో) !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆదివారం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పీకలదాక మద్యం సేవించిన యువతి కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. విస్కీ కిక్కు తలకు ఎక్కడంతో అర్దరాత్రి నడిరోడ్డులో కారు నిలిపేసింది. తరువాత కారు దిగి అటు వైపు వెలుతున్న వారిని అమ్మనాబూతులు తిట్టింది.

నడిరోడ్డులో నానా హంగామా చేసింది. గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి నిద్రలేకుండా చేసింది, నడి రోడ్డులో గంట సేపు, ఫుట్ పాత్ మీద రెండు గంటలు నిద్రపోయింది. సోమవారం వేకువజామున మద్యం మత్తు దిగిపోవడంతో నిద్రలేచిన యువతి కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.

సెప్టెంబర్ 10వ తేది రాత్రి పోద్దుపోయే వరకూ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మద్యం సేవించిన యువతి కారు నడుపుకుంటూ బెంగళూరులోని బీటీఎం లేఔట్ లోకి వచ్చింది విస్కీ నిషా తలకు ఎక్కడంతో బీటీఎం రోడ్డులో కారు నిలిపిన యువతి అక్కడ నడిరోడ్డులో నానా హంగామా చేసింది.

నడి రోడ్డులో గట్టిగా కేకలు వేసి డ్యాన్స్ లు చేసి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి సినిమా చూపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు మాత్రం సంఘటనా స్థలానికి రాలేదు. రోడ్డులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన యువతి అక్కడే నిద్రపోయింది.

గంట తరువాత రోడ్డు మీద నుంచి ఫుట్ పాత్ మీదకు వెళ్లి అక్కడా రెండు గంటలు నిద్రపోయింది. సోమవారం వేకువ జామున నిషా దిగిపోవడంతో నిద్రలేచి ఇంటికి వెళ్లిపోయింది. యువతి మద్యం మత్తులో చేసిన హంగామా మొత్తం స్థానికులు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వైరల్ అయ్యింది. బీటీఎం లేఔట్ లో నివాసం ఉంటున్న యువతి ఇంత హంగామా చేసిందని వెలుగు చూసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drunk woman creates ruckus in BTM Layout, Bengaluru on September 10 night. The woman in an inebriated condition danced on the road, causing nuisance to residents.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X