శ్రీదేవి హత్య!: 'స్వామీ! ఇక తగ్గు', తల్లి చివరి చూపు కోసం కూతుళ్లు వెయిటింగ్, ఇంటి వద్ద భద్రత
దుబాయ్: సినీ నటి శ్రీదేవి మృతి కేసును మూసివేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం, ఫోరెన్సిక్ నివేదికలో లోపం లేదని తేల్చడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Recommended Video

శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించడంపై అమర్ సింగ్ స్పందించారు. ఇప్పటికైనా మీడియా మిత్రులు, నా మిత్రుడు సుబ్రహ్మణ్య స్వామి తప్పుడు ఆరోపణలకు స్వస్తీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు స్వామి సంచలన ఆరోపణలు చేయడంతో అమర్ సింగ్ పైవిధంగా స్పందించారు.

దుబాయ్ నుంచి ముంబైకి
శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ విమానాశ్రయం నుంచి ముంబైకి తరలిస్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో ముంబై చేరుకోనుంది. అనిల్ అంబానీకి చెందిన చార్టర్డ్ విమానంలో భౌతికకాయం తీసుకు వస్తున్నారు.

అభిమానుల సందర్శనార్థం
బుధవారం మధ్యాహ్నం వరకు సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత ముంబైలోని పవన్ హాన్స్ స్మశానంలో మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.

శ్రీదేవి ఇంటికి అభిమానగణం
దుబాయ్‌లోని ముహైస్నా కేంద్రం వద్ద శ్రీదేవి పార్థివ దేహానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగియడంతో అప్పగించారు. తమ అభిమాన నటిని చివరిసారి చూసేందుకు, వీడ్కోలు పలికేందుకు ముంబైలోని ఆమె నివాసం వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

కట్టుదిట్టమైన పోలీసు భద్రత
ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీదేవి కుమార్తెలు ఖుషి, జాహ్నవిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అనిల్ కపూర్ నివాసం వద్ద వేచి ఉన్నారు. వారితో పాటు చాలామంది అక్కడే వేచి చూస్తున్నారు.

తెలుపు రంగు అంటే ఇష్టమంటూ
శ్రీదేవి చివరి కోరిక ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవికి తెలుపు రంగు అంటే ప్రాణమని, తన అంతిమ యాత్ర అంతా తెలుపు రంగుతో మెరికి పోవాలనేది ఆకాంక్ష అని, ఇది ఆమె చివరి కోరిక అంటూ ప్రచారం సాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications