వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివాల్వర్ గేమ్: యువకుడి మృతి, మరణ శిక్ష

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇద్దరు యువకులు రివాల్వర్ తో కాల్చుకునే ఆట ఆడటానికి సిద్దం అయ్యారు. అయితే వారి ఆట ఇద్దరి జీవితాలను సర్వనాశనం చేసింది. ఒకరు బుల్లెట్ తూటాకు బలి అయ్యారు. ఒకతను మరణ శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు.

అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారతీయ సంతతికి చెందిన జస్కరన్ సింగ్ (18), విక్రమ్ విర్క్ (27) ఇద్దరు స్నేహితులు.

శనివారం విక్రమ్ విర్క్ దగ్గరకు జస్కరన్ సింగ్ వెళ్లాడు. తరువాత రష్యన్ రౌలెట్ట్ గేమ్ ( రివాల్వర్ తో ఒకరిని ఒకరు కాల్చే ఆట) ఆడుదామని చెప్పాడు. అయితే విర్క్ రివాల్వర్ లో బుల్లెట్ లు లేవని భావించాడు. ఆట ఆడటానికి తాను సిద్దమే అని చెప్పాడు.

During Russian Roulette Game,Indian-American Killed in US

తరువాత సింగ్ రెండు సార్లు విర్క్ తలకు రివాల్వర్ గురి పెట్టి కాల్చాడు. అందులో ఒక్క బుల్లెట్ బయటకు రాలేదు. తరువాత విర్క్ కు రివాల్వర్ ఇచ్చాడు. ఇప్పుడు నీ చాన్స్ వచ్చిందని చెప్పాడు. అప్పటికి రివాల్వర్ లో బుట్లెట్ లు ఉన్న విషయం విర్క్ కు తెలియదు.

తరువాత రివాల్వర్ తీసుకుని సింగ్ తల మీద గురి పెట్టి ట్రిగర్ నొక్కాడు. అంతే బుల్లెట్ దూసుకు వెళ్లింది. సింగ్ కుప్పకూలిపోయాడు. విర్క్ భయంతో అల్లాడిపోయాడు. వెంటనే అతని కారులో సమీపంలోని ఆసుపత్రి దగ్గరకు సింగ్ ను తీసుకు వెళ్లాడు.

అయితే సింగ్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి సిబ్బంది కారులో ఉన్న రివాల్వర్ స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విర్క్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మొదట సింగ్ రివాల్వర్ తో కాల్చుకున్నాడని విర్క్ పోలీసులకు చెప్పాడు.

అయితే పోలీసులు బెండ్ తియ్యడంతో విర్క్ అసలు విషయం అంగీకరించాడు. రివాల్వర్ తో కాల్చుకునే ఆట ఆడుతున్న సమయంలో ఇలా జరిగిందని చెప్పాడు. కోర్టు విర్క్ కు మరణ శిక్ష, 1.5 లక్షల డాలర్ల అపరాధ రుసుం విధించిందని పోలీసులు తెలిపారు.

English summary
Mr Singh was shot in the parking lot of a Red Roof Inn, police said. Mr Virk allegedly told police that he handed Mr Singh a handgun on Saturday that Mr Virk believed he had emptied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X