సమ్మర్‌లో కొడైకెనాల్ వెళ్లాలనుకుంటున్నారా?: అవి తప్పనిసరి

Kodaikanal: వేసవి సెలవుల్లో హిల్ స్టేషన్లకు పరుగులు పెడుతుంటారు జనం. దీనికి- ఎండ తీవ్రత ఒక కారణమైతే- పిల్లలకు సెలవులు రావడం మరో కారణం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో గల పర్యాటక ప్రాంతాలకు భారీగా తరళి వెళ్తుంటారు. సమ్మర్ సీజన్‌లో ప్రత్యేకించి- ఊటీ, కొడైకెనాల్‌కు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.

కొడైకెనాల్, నీలగిరి హిల్ స్టేషన్లను వెళ్లాలనుకునే వారిపై ప్రత్యేక ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇకపై వారంతా కూడా ఇ-పాస్‌లను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కొడైకెనాల్, నీలగిరి వెళ్లడానికి ఇ-పాస్‌లను తప్పనిసరి చేసింది మద్రాస్ హైకోర్టు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది.

e-pass to mandate to enter Nilgiris and Kodaikanal from May 7 to June 30

మే 7 నుంచి జూన 30వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కొడైకెనాల్, నీలగిరిలకు వచ్చే ప్రతి వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, డేటాను సేకరించాలంటూ జస్టిస్ ఎన్ సతీష్ కుమార్, జస్టిస్ డీ భరత చక్రవర్తితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ బాధ్యతలను నీలగిరి, దిండిగల్ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

ఇ-పాస్‌లపై ఎలాంటి పరిమితి విధించొద్దని బెంచ్ సూచించింది. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ ఇ-పాస్ లభిస్తుంది. వాహనం రకం, అందులో ఉండే ప్రయాణికుల సంఖ్య, వారు ఎన్నిరోజుల పాటు కొడైకెనాల్, నీలగిరిల్లో ఉంటారు.. వంటి వివరాలన్నింటినీ అధికారులు సేకరించాల్సి ఉంటుంది.

చవనన్ మోహనన్, రాహుల్ బాలాజీ, ఎం శాంతనరామన్ దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను ఇచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసింది. ప్రతి రోజూ 20 వేలకు పైగా వాహనాలు నీలగిరికి వస్తున్నాయంటూ తెలిపింది.

ఇందులో కార్లు- 11,500, వ్యాన్లు- 1,300, బస్సులు- 600, టూ వీలర్లు- 6,500 ఉన్నాయని వివరించింది. కళ్లార్, కుంజపనై, నడుగని, కక్కనల్లా, థాలూర, ఛోళడి, గెడ్డై, పట్టావయల్ చెక్‌పోస్టుల మీదుగా ఆయా టూరిస్టు వాహనాలన్నీ రాకపోకలు సాగిస్తున్నాయంటూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు నివేదించింది.

ఇంతమంది ఊటీ, కూనూరు, కోటగిరి, గూడలూరు, నెల్లివలం వంటి హిల్ స్టేషన్లకు వస్తోంటే అక్కడ సౌకర్యాలను ఎలా కల్పిస్తున్నారు? ఎలిఫెంట్ జోన్‌ అయినందున ఏనుగుల సంచారానికి ఇబ్బందులు తలెత్తడం వంటి అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ఇ-పాస్ ఉత్తర్వులను జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+