కుదిపేసిన భారీ భూకంపం: కాశ్మీర్ అతలాకుతలం

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో భూప్రకంపం సంభవించింది. దీంతో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో, హిమాచల ప్రదేశ్‌లలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంపంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది.

సుమారు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. భూకంప తీవ్రత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార వ్యవస్థ పూర్తిగా స్ధంభించింది. ఈ భూకంపంతో కాశ్మీర్‌లో టెలిఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లోనూ భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందుకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించిన తరుణంలో ఢిల్లీ మెట్రో సేవలను నిలిపివేశారు.

గతేదాడి ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఎంత నష్టం కలిగించిందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని దేవుడిని ప్రార్ధిస్తున్నానంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

పాక్, ఆప్ఘనిస్థాన్‌కు సాయం చేసేందుకు సిధ్ధం: ప్రధాని మోడీ

భూకంప ప్రకటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చెందారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో తక్షణ చర్యలకు ప్రధాని మోడీ ఆదేశించారు. భూకంప ప్రాంతాల్లో నష్టం జరగొద్దని ప్రార్ధిస్తున్నానంటూ భారత ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్నిచ్చారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్‌లకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో 7.7 తీవ్రతతో భూకంపం: యూఎస్‌జీఎస్‌

ఆఫ్ఘనిస్థాన్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని సైఫాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందుకుష్ పర్వత ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+