ఢిల్లీలో భారీ భూకంపం- అటు వర్షాలతో..
Delhi earthquake 2025: భారత ఉపఖండంలో వరుస భూకంపాలు సంభవిస్తోన్నాయి. ప్రత్యేకించి- పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లల్లో. నేపాల్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నెలన్నర రోజుల వ్యవధిలో రిక్టర్ స్కేల్ పై అయిదుకు పైగా తీవ్రతతో భూమి కంపిస్తూ వస్తోంది ఆయా దేశాల్లో.
ఇప్పుడు తాజా హర్యానాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా రికార్డయింది. హర్యానాలోని జఝ్ఝర్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. దీనివల్ల ఇప్పటివరకు ఎంతమేర ప్రాణ నష్టం సంభవించిందనేది ఇంకా తెలియరాలేదు. ఆస్తినష్టం నమోదైంది. పలు నివాసాలు బీటలు వారినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ఉదయం సరిగ్గా 9:04 నిమిషాలకు భూమి ప్రకంపించింది. 28.63 నార్త్ అక్షాంశం, 76.68 ఈస్ట్ రేఖాంశం పరిధిలోకి వచ్చే హర్యానాలోని జఝ్ఝర్ ప్రాంతంలో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు తెలిపింది.
దీని తీవ్రత ఢిల్లీపైనా పడింది. పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు రికార్డయినట్లు సమాచారం అందింది. ఢిల్లీ- ఎన్సీఆర్ పొరుగునే ఉన్న హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లల్లోనూ తేలికపాటి ప్రకంపనలు కనిపించాయి.
రోహిణి, గ్రేటర్ కైలాష్, గ్రేటర్ నోయిడా, ద్వారకా, సాకేత్, వసంత్ కుంజ్, జనక్ పురి, పశ్చిమ్ విహార్, పత్పర్ గంజ్, మయూర్ విహార్, చాందిని చౌక్, కరోల్ బాగ్, చాణక్యపురి వంటి ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూమి ప్రకంపించినట్లు స్థానికులు వెల్లడించారు.
EQ of M: 4.4, On: 10/07/2025 09:04:50 IST, Lat: 28.63 N, Long: 76.68 E, Depth: 10 Km, Location: Jhajjar, Haryana.
— National Center for Seismology (@NCS_Earthquake) July 10, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/uDNjvD8rWT
ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. ప్రధాన భూకంపం తరువాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. వర్షంలోనూ ఆరుబయటే ఉంటోన్నారు.












Click it and Unblock the Notifications