ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..?
లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది.ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన్ను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. కేజ్రీవాల్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ అరెస్ట్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తాను ఈడీ విచారణకు హాజరవుతానని.. అయితే తనని ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో అరెస్ట్ కాకుండా చూడాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు 12 మంది ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉండటంతో.. కేజ్రీవాల్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిసోడియా, మాగుంట రాఘవరెడ్డి, కవిత వంటి వారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications