నారా భరత్ కు షాక్ ఇచ్చిన ఈడీ, ఆంధ్రా, కర్ణాటక, చెన్నైలో సినిమా చూపించారు, క్వారీల్లో !
కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి శనివారం తెల్లవారుజామున ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బళ్లారి నగరంలో ఇంటింటికి కుక్కర్లను అందించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. కర్ణాటకలోని బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించి పత్రాలను పరిశీలిస్తున్నారు.
ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన నాలుగు చోట్ల దాడులు చేసిన ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. చాలా చోట్ల ఈడీ దాడులు జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నారా భరత్ రెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కన్నడ మీడియా అంటోంది.

కొన్నేళ్ల క్రితం నారా భరత్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి చెందిన బెంగళూరు, చెన్నై కార్యాలయాలపైనా ఈడీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. బళ్లారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి కుటుంబం గ్రానైట్ పరిశ్రమతో పాటు కొప్పల్ జిల్లా కుకనూరు, ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో క్వారీల వ్యాపారం చేస్తున్నాడని ఈడీ అధికారుల గుర్తించారని తెలిసింది.
బెంగళూరు సిటీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లో బళ్లారి వెళ్లిన ఈడీ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకే నారా భరత్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలుపెట్టి పలు పత్రాలను స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నివాసం, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కార్యాలయం, మామ ప్రతాప్ రెడ్డి నివాసం, కార్యాలయం, ఇతర బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

దేశ విదేశాల్లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, సోదరుడు నారా ప్రతాప్‌రెడ్డి, కుమారుడు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రత్నబాబు, సతీష్ రెడ్డిలకు చెందిన 20 ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రత నడుమ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications