మంత్రికి మైండ్ బ్లాక్, పీఏ ఇంట్లో రూ. ఎన్నికోట్లు అంటే ? నోట్ల కట్టలు గుట్టలు గుట్టలు, వీడియో వైరల్ !

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ అధికారుల సోదాల్లో ఓ మంత్రి ప్రయివేట్‌ సెక్రటరీ అసిస్టెంట్‌ ఇంట్లో కుప్పలు తెప్పలుగా దొరికిన డబ్బు లెక్కింపు పనులు వేగవంతం అయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఇదే సమమంలో మంత్రికి ఈడీ షాక్ ఇచ్చింది.

ఈ సమయంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లో డబ్బుల కట్టలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. అక్రమంగా నిల్వ చేసిన నోట్ల కట్టలు దాదాపుగా రూ 20 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈడీ అధికారులు స్వాదీనం చేసుకున్న డబ్బుల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి ఎంత డబ్బు ఉందో అధికారిక సమాచారం చెబుతామని ఈడీ అధికారులు తెలిపారని స్థానిక మీడియా తెలిపింది.

ED officials seized around Rs 20 crore from the house of Jharkhand minister s personal secretary

జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పీఎస్ సంజయ్ లాల్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేసి కోట్ల రూపాయల డబ్బుల కట్టలు స్వాధీనం చేసుకున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం కలకలం రేపింది. అయితే మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంటిలో ఇంత భారీ మొత్తంలో డబ్బులు చిక్కడం జార్ఖండ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు మంత్రి ఆలంగీర్ ఆలందే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం, మంత్రి అంగీర్ ఆలం ఇంకా స్పందించలేదు. మంత్రి అవినీతికి పాల్పడి ఇంత భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడని, ఆలంగీర్ ఆలంను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి పీఏని విచారణ చేసి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+