శశికళ, తమిళనాడు సీఎం అభ్యర్థి తమ్ముడు బెంగళూరు జైల్లో: ఏంటి కథ!
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ వర్గం నుంచి బరిలో ఉన్న ఎడప్పాడి పళనిసామి సమీప బంధువు (సోదరుడు) చంద్రకాంత్ రామలింగం అక్రమంగా బ్లాక్ మనీని కొత్త నోట్లు (రూ. 2,000 నోట్లు)గా మార్చుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.
బ్లాక్ మనీ కేసులో అరెస్టు అయిన చంద్రకాంత్ రామలింగం ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు అదే జైలుకు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ శిక్ష అనుభవించడానికి వెలుతున్నారు.
తమిళనాడు సీఎం అభ్యర్థి (శశికళ వర్గం) ఎడప్పాడి పళనిసామి, ఈరోడ్ కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రామలింగం కుమారుడు చంద్రకాంత్ రామలింగం ఒకే ఇంటిలో అక్కా, చెల్లిని వివాహం చేసుకున్నారు. పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత ఈ రోడ్డులోని రామలింగం ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

అదే సమయంలో బెంగళూరులో నివాసం ఉంటున్న రామలింగం కుమారుడు చంద్రకాంత్ రామలింగం ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో అప్పుడే చలామణిలోకి వచ్చిన రూ. 6 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అరెస్టు అయిన చంద్రకాంత్ రామలింగం ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు శశికళకు అదే జైలుకు వెలుతున్నారని, బ్లాక్ మని కేసు విచారణ ఎదుర్కొంటున్న చంద్రకాంత్ ను శశికళ వర్గీయులు కలుస్తారని ఆరోపణలు వస్తున్నాయి.
పళనిసామికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని సీఎం కాకుండా అడ్డుకోవాలని పన్నీర్ సెల్వం వర్గీయులు గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారని సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications