తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు: పళని, పన్నీర్ సెల్వం చెక్క భజన, దినకరన్ ధీమా !

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వచ్చే వారం కచ్చితంగా ఇంటికి వెలుతారని, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరారని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ జోస్యం చెప్పాడు.

చెన్నైలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విమర్శించారు. శశికళ ఎంతో నమ్మకంతో ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిని చేస్తే మాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని దినకరన్ ఆరోపించాడు.

Edappadi PalanisamY govt will dissolve next week TTV Dinakaran

వచ్చే వారంలో తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కచ్చితంగా రద్దు చేస్తారని దినకరన్ ధీమా వ్యక్తం చేశాడు. తమిళనాడు ప్రభుత్వం రద్దు అయిన తరువాత ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి చెక్కభజన చేసుకోవాలని టీటీవీ దినకరన్ వ్యంగంగా అన్నాడు.

మెజారిటీ లేని ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నిలబడలేదని, తన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరని టీటీవీ దినకరన్ చెప్పాడు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పతనానికి ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ మొదలైయ్యిందని దినకరన్ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+