ఎన్నికల ప్రచార డీప్ ఫేక్ వీడియో.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫిర్యాదు!!
డీప్ ఫేక్ వీడియోలు.. ఇప్పుడు హీరోయిన్లకు మాత్రమే కాదు, హీరోలకు కూడా పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో సినీ తారలు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోలు తయారుచేసి బయటకు వదులుతున్న డీప్ ఫేక్ వీడియోలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రణ్‌వీర్ సింగ్ రాజకీయ ప్రచారం వీడియో
ఆ వీడియోలో రణ్‌వీర్ సింగ్ భారతదేశ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రణ్‌వీర్ సింగ్ కామెంట్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆ వీడియోలో రణ్‌వీర్ సింగ్ కోరుతున్నట్లుగా ఉంది.

ఏఐ తో మార్ఫ్ చేసిన డీప్ ఫేక్ వీడియో
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో ఇది తాను చేసిన వీడియో కాకపోవడంతో, తన వీడియోను ఏఐ తో మార్ఫ్ చేసి డీప్ ఫేక్ వీడియో గా తయారు చేయడంతో రణ్‌వీర్ సింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఒక రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న వీడియో తాను చేసిన వీడియో కాదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ కేసు నమోదు
ఈ డీప్ ఫేక్ వీడియో కి సంబంధించి క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్ సిబ్బంది ఈ వీడియోని ప్రచారం చేస్తున్న ఖాతా పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పోలీసులు ఇటువంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రణ్‌వీర్ సింగ్ కూడా అది ఒరిజినల్ వీడియో కాదని, అది ఫేక్ వీడియో అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Deepfake se bacho dostonnnn 💀
— Ranveer Singh (@RanveerOfficial) April 19, 2024
ప్రజలు ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలతో జాగ్రత్త
డీప్ ఫేక్ వీడియోలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇటీవల రణ్‌వీర్ సింగ్ వారణాసి పర్యటనలో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు రూపొందించి సోషల్ మీడియాలో దానిని ప్రమోట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications