నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా - కలిసొచ్చేదెవరికి..!!
మరో ఎన్నికల నగరాకు సర్వం సిద్దం అయింది. జమ్ము కాశ్మీర్ తో సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. ఈ మధ్నాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. జమ్ములో తిరిగి రాష్ట్ర హోదా పునరుద్దరణలో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నజరగనున్నాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసింది. ఈ ఎన్నికలు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ సమర్ధతకు పరీక్షగా మారనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్
పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారాయి. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తం అయింది. సెప్టెంబర్, అక్టోబర్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇతర రాష్ట్రాలతో కలిసి జమ్ము కాశ్మీర్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా నిర్వహణలో మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.

పదేళ్ల తరువాత
జమ్ము కాశ్మీర్ లో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, జమ్ము కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ వాయిదే వేసే అవకాశం లేదని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత తిరిగి రాష్ట్ర హోదా పునరుద్దరణ పైన కేంద్రం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టులోనూ ఈ అంశం పైన విచారణ జరిగింది. దీంతో, ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో 90 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మోదీ వర్సస్ రాహుల్
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3తో ముగియనుంది. చివరిసారిగా 2019లో హర్యానా, మహారాష్ట్రలో అక్టోబర్ 21 న ఎన్నికలు జరిగాయి. ఇక నవంబర్ 26వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ తమ పార్టీ నేతలను ఇంఛార్జ్ లుగా నియమించింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జార్ఖండ్ లో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ప్రధాని మోదీ..ప్రతిపక్ష నేత రాహల్ తో పాటుగా ఇతర పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications