డీకేశీ ఫ్యామిలీ ప్రయాణించిన హెలికాప్టర్ లో సోదాలు, పుణ్యక్షేత్రంలో ?

బెంగళూరు/ధర్మస్థలం: కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నియమాలు అమలులో ఉన్నాయి. కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణించిన హెలికాప్టర్ లో అధికారులు సోదాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు నగర శివార్లలోని కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి డీకే. శివకుమార్ పోటీ చేస్తున్నారు. డీకే. శివకుమార్ నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తారని ఆందోళన చెందిన డీకే. శివకుమార్ ముందు జాగ్రతగా ఆయన తమ్ముడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ తో అదే కనకపుర నియోజక వర్గం నుంచి నామినేషన్ వేయించారు.

DK Shivakumar

అయితే డీకే. శివకుమార్ నామినేషన్ పత్రాలు పరిశీలించిన అధికారులు డీకే. శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డీకే. శివకుమార్, ఆయన బార్య ఉషా, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు, కుమారుడితో కలిసి శనివారం ప్రత్యేక హెలికాప్టర్ లో ధర్మస్థలం వెళ్లారు.

ధర్మస్థలంలోని హెలిప్యాడ్ లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే అక్కడికి ఎన్నికల కమీషన్ అధికారులు వెళ్లారు. మీ హెలికాప్టర్ ను పరిశీలించాలని ఎన్నికల అధికారులు డీకే. శివకుమార్ ప్రయాణించిన పైలెట్ కు చెప్పారు. ఇది ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించలేదని, ఇప్పటికే ఎన్నికల కమీషన్ కు లేఖ కూడా రాసి అనుమతి తీసుకున్నామని పైలెట్ ఎన్నికల అధికారులకు చెప్పారు.

ఆ సమయంలో పైలెట్ కు, ఎన్నికల అధికారుల మధ్య మాటల యుద్దం జరిగింది. అప్పటకే డీకే. శికుమార్ కుటుంబ సభ్యులు ధర్మస్థలంలోని శ్రీమంజునాథ్ స్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ సందర్బంలో ఈ విషయంపై మాట్లాడటానికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ నిరాకరించారని కన్నడ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+