Employee: డిపోలో బీఎంటీసీ ఉద్యోగి ఆత్మహత్య, డిపో మేనేజర్ టార్చర్ తో, భార్య ఎంట్రీతో !

బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. బీఎంటీసీ బస్సు డ్రైవర్ అయిన అతను అతని భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా ఆ డ్రైవర్ దిగులుగా ఉన్నాడని తెలిసింది. ప్రభుత్వ రంగసంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. సిటీ బస్సు డ్రైవర్ అయిన అతను ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు. డిపో మెయిన్ గేట్ లోపలికి వెళ్లిన డ్రైవర్ అతని రూట్ బస్సు డిపోలో నుంచి బయటకు తీసుకురాలేదు. డ్రైవర్ ఉద్యోగానికి రాలేదని డిపో లోపల ఉన్న కొందరు అధికారులు అనుకున్నారు. మద్యాహ్నం భోజనం సమయంలో డిపో ఆవరణంలోనే ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన సాటి సిబ్బంది హడలిపోయారు. డిపో మేనేజర్ తనను టార్చర్ పెడుతున్నాడని ఆ డ్రైవర్ డెత్ నోట్ రాసి అదే డిపోలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 బెంగళూరు సిటీ బస్సు డ్రైవర్

బెంగళూరు సిటీ బస్సు డ్రైవర్

బెంగలూరు నగరంలో ప్రతిరోజు సంచరించే బీఎంటీసీ బస్సుల కోసం అనేక డిపోలు ఉన్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ లో బీఎంటీసీ సంస్థ డిపో నెంబర్ 21 ఉంది. బీఎంటీసీ డిపో 21లో హోళబసప్ప అలియాస్ బసప్ప (49) డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సీమా అనే మహిళను చాలా సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న బసప్ప అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

 ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు

ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు

బీఎంటీసీ బస్సు డ్రైవర్ అయిన బసప్ప అతని భార్య సీమా, అతని పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా డ్రైవర్ బసప్ప దిగులుగా ఉన్నాడని, భార్య సీమాతో పాటు పిల్లలతో కూడా ఎక్కువగా మాట్లాడటం లేదని తెలిసింది. ప్రభుత్వ రంగసంస్థలో ఉద్యోగం చేస్తున్న బసప్ప ప్రతినిత్యం ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. సిటీ బస్సు డ్రైవర్ అయిన బసప్ప ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్లాడు.

 డిపో లోపలే డ్రైవర్ ఆత్మహత్య

డిపో లోపలే డ్రైవర్ ఆత్మహత్య

డిపో నెంబర్ 21 మెయిన్ గేట్ లోపలికి వెళ్లిన డ్రైవర్ బసప్ప ప్రతినిత్యం సంచరించే అతని రూట్ బస్సును డిపోలో నుంచి బయటకు తీసుకురాలేదు. డ్రైవర్ బసప్ప ఉద్యోగానికి రాలేదని డిపో లోపల ఉన్న కొందరు అధికారులు అనుకున్నారు. తరువాత ఆ రూట్ బస్సుకు వేరే డ్రైవర్ ను పంపించి బసప్ప మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసినా అతను రిసీవ్ చెయ్యలేదు.

 నా ఆత్మహత్యకు మేనేజర్ కారణం

నా ఆత్మహత్యకు మేనేజర్ కారణం

మద్యాహ్నం భోజనం సమయంలో డిపో ఆవరణంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో డ్రైవర్ బసప్ప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన సాటి సిబ్బంది హడలిపోయారు. డిపో మేనేజర్ తనను టార్చర్ పెడుతున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని బసప్ప డెత్ నోట్ రాసిపెట్టాడు.

 మేనేజర్ మీద కేసు పెట్టిన భార్య

మేనేజర్ మీద కేసు పెట్టిన భార్య

నా ఆత్మహత్యకు డిపో నెంబర్ 21 మేనేజర్ కారణం అని డ్రైవర్ బసప్ప డెత్ నోట్ రాసి అదే డిపోలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నా భర్త బసప్ప ఆత్మహత్యకు కారణం డిపో మేనేజర్ అని బసప్ప భార్య సీమా రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే బసప్ప రాసిన డెత్ నోట్ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని రాజరాజేశ్వరి నగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+