8:37కి సిక్ లీవ్ కోసం మెసేజ్.. 8: 47కి ఉద్యోగి మృతి !
కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. రెప్పపాటు ఈ ప్రయాణం కోసం ఎందుకు వృధా ప్రయాస అంటూ ఓ మహాకవి చెప్పిన మాటలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. మనిషి జీవితం ఎంత అనూహ్యమో నిరూపించే ఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ తరహా అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న మనుషులు.. కొద్దిసేపట్లోనే మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గానే ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగోలేదని.. సార్ నాకు సెలవు కావాలి అంటూ తన పైఅధికారికి ఓ ఉద్యోగి మెసేజ్ చేశారు. అలా చేసిన కాసేపటికే హఠాన్మరణం చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్ల శంకర్ అనే ఉద్యోగి తన పైఅధికారి కేవీ అయ్యర్‌కు ఉదయం 8:37 గంటలకు మెసేజ్ పంపారు. "సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను. ఈరోజు ఆఫీస్‌కు రాలేను. దయచేసి సెలవు మంజూరు చేయండి అని కోరారు. ఉద్యోగులు ఆ రకంగా సెలవు కోరడం సాధారణంగా జరిగే విషయం కావడంతో అతను కూడా ఒకే అని పెట్టేసి పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

కానీ మళ్లీ పదినిమిషాలకే అంటే ఉదయం 8:47 గంటలకు శంకర్ గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ విషాదకర విషయం ఉదయం 11 గంటలకు అయ్యర్‌కి సమాచారం అందింది. దాంతో తనతో కొద్దిసేపటికి ముందే మెసేజ్‌లో మాట్లాడిన వ్యక్తి ఇక లేరని తెలిసి అయ్యర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మొదట తాను ఆ విషయాన్ని నమ్మలేదని.. మరో సహోద్యోగికి ఫోన్ చేసి తిరిగి నిర్ధారించుకొని, ఆయన నివాస చిరునామా తెలుసుకున్నానని తెలిపారు. అయితే ఇంటికి వెళ్లి చూడగా ఆయన లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయ్యానని వివరించారు.
ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. "ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని శంకర్ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం నమ్మలేకపోతున్నాను. జీవితం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. గుండెపోటు ఘటనల్లో 90 నిమిషాల లోపు వైద్య సహాయం అందితే ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
DEVASTATING INCIDENT WHICH HAPPENED TODAY MORNING :-
— KV Iyyer - BHARAT 🇮🇳🇮🇱 (@BanCheneProduct) September 13, 2025
One of my colleague, Shankar texted me today morning at 8.37 am with a message
"Sir, due to heavy backpain I am unable to come today. So please grant me leave." Such type of leave requests, being usual, I replied "Ok take…












Click it and Unblock the Notifications