Enjoy: రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు ఇచ్చి రేవ్ పార్టీ, క్యాసినోకు వెళ్లిన పోలీసు అధికారులు, అమ్మాయిలతో ?, ఢమాల్!
బెంగళూరు/ జైపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన కార్యకలాపాలలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రేవ్ పార్టీ, క్యాసినో షేధించినా ఆ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. అర్దరాత్రి దాటిన తరువాత క్యాసినో, రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతంలో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్బంలో మహిళలు, యువతులతో పాటు వేరే రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులు,. ఓ ప్రభుత్వ టీచర్ అరెస్టు కావడం కలకలం రేపింది.

క్యాసినో పోటుగాళ్లు
రాజస్థాన్ లోని జైపూర్ లో అర్దరాత్రి దాటిన తరువాత క్యాసినో, రేవ్ పార్టీ నిర్వహిస్తారని జైపూర్ పోలీసులకు పక్కాసమాచారం అందింది. జైపూర్ సిటీ శివార్లోని రేవ్ పార్టీ, క్యాసినో జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేసిన జైపూర్ పోలీసులు 13 మంది యువతులు, మహిళలతో తో సహ 84 మందిని అరెస్టు చేశారు.

ఎగరేసుకుంటూ వెళ్లిన కర్ణాటక పోలీసులు
అరెస్టు అయిన 84 మందిని ఒక్కొక్కరిని పక్కకు పిలిచిన జైపూర్ పోలీసులు వారి వివరాలు, అడ్రస్ లు సేకరించారు. ఆ సందర్బంలో నలుగురు చెప్పి వివరాలు తెలుసుకున్న జైపూర్ పోలీసులు షాక్ అయ్యారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసుల అధికారులు, అదే రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ సైతం క్యాసినో ఆడటానికి, రేవ్ పార్టీలో ఎంజాయ్ చెయ్యడానికి రాజస్థాన్ వచ్చారని తెలుసుకున్న జైపూర్ పోలీసులు షాక్ అయ్యారు.

ఉద్యోగాలకు సెలవు పెట్టి వెళ్లారు
క్యాసినోలో కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారని జైపూర్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకకు చెందిన పోలీసు అధికారి అంజనప్పతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు, కర్ణాటకలోని కోలారులోని తరహళ్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ కేఎన్, రమేష్ అరెస్టు అయ్యారని జైపూర్ పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు.

ఎంట్రీ ఫీజు రూ. 2 లక్షలు
కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు, టీచర్ జైపూర్ వెళ్లి క్యాసినో ఆడటానికి రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఉద్యోగానికి సెలవు పెట్టిన పోలీసు అధికారులు రాజస్థాన్ వెళ్లారని వెలుగు చూడటంతో సీనియర్ పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications