Enjoy: లక్షల నగలు చోరీ చేసి కిలాడీలు ఏం చేశారంటే ?, అమ్మాయిలతో ?

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులోని చాలా కుటుంబాల్లో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం ఇంటికి తాళం వేసి ఉద్యోగాలకు వెలుతున్న దంపతులు రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నారు. పగలు, రాత్రి సంచరిస్తూ ఏ ఇంటికి తాళం వేశారు అని గుర్తిస్తున్న ఇద్దరు కిలాడీలు చోరీలు చేసి అమ్మాయిలతో జల్సాలు చేస్తున్నారు.

కర్ణాటకలోని చెన్నరాయణపట్టణంలో నివాసం ఉంటున్న అయ్యప్ప అలియాస్ మురగేష్ (36), రవి అలియాస్ చెలియా రవి (26) అనే నిందితులు బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో సంచరించిన రవి, మురగేష్ అద్దె ఇండ్లు కావాలని అనేక మందిని సంప్రధించారు.

Enjoy: Two arrested for house theft cases in Benagluru city in Karnataka.

అద్దె ఇండ్ల కోసం తిరిగే ముసుగులో పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇళ్లకు తాళాలు వేశారు అని గుర్తించిన మురగేష్, రవి చేతివాటం చూపించారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలు, విలువైన వస్తువులు, నగదు లూటీ చేశారు. చోరీ చేసిన బంగారు నగలు విక్రయించారు.

నగలు విక్రయించిన డబ్బుతో రాత్రి పూట మద్యం సేవిస్తూ మంచిమంచి అమ్మాయిలను సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన మురగేష్, రవి బెంగళూరు పోలీసులకు చిక్కిపోయారు. నిందితుల నుంచి రూ. 14 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని నందిని లేఔట్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+