వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతిపై అసభ్య వ్యాఖ్యలు: దయాశంకర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

పాట్నా: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై అసభ్య వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఆయనను బీహార్‌లోని బక్సర్‌లో అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మాయావతిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో దయాశంకర్‌పై కేసు నమోదైన అనంతరం ఆయన పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే.

వేశ్య ఎఫెక్ట్: 'నా మైనర్ కూతుర్ని వేధిస్తున్నారు'వేశ్య ఎఫెక్ట్: 'నా మైనర్ కూతుర్ని వేధిస్తున్నారు'

Ex-BJP leader Dayashankar arrested for comparing Maya to a 'prostitute'

అయితే, స్థానిక కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా, జార్ఖండ్‌లోని ఆలయంలో దయాశంకర్ దిగిన ఫొటోలు బయటకు రావడంతో పోలీసులు.. విస్తృతంగా గాలింపు చేపట్టి బీహార్‌లో శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

కాగా, మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దయాశంకర్ కుటుంబసభ్యులకు మాయావతి పార్టీ నేతల నుంచి వేధింపులు ఎదురవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

English summary
The Uttar Pradesh police on Friday arrested expelled BJP leader Dayashankar Singh from Bihar's Buxar district in a joint operation with local authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X