మాజీ మంత్రి భార్య మా జీవితాలను నాశనం చేసింది, ప్రెస్ మీట్ పెట్టిన మాజీ కారు డ్రైవర్, మ్యాటర్ ?

లక్షల విలువైన భూమిని కబ్జా చేసి మింగేశారనే ఆరోపణలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన భార్య భవానీ రేవణ్ణ, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వాళ్ల మాజీ కారు డ్రైవర్ సంచలన ఆరోపణలు చేశారు.14 ఏళ్లుగా ప్రజ్వల్ రేవణ్ణకు కారు డ్రైవర్‌గా పని చేసిన కార్తీక్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు చెందిన 13 ఎకరాల భూమిని భవానీ రేవణ్ణ కుటుంబం కబ్జా చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మాజీ ప్రధాని కుమారుడు హెచ్ డీ రేవణ్ణ కుటుంబం మీద గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ కార్తీక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను గతంలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కారు డ్రైవర్‌గా పనిచేసిన విషయం అందరికి తెలుసు అని అన్నారు. ఇదే సందర్బంలో కారు డ్రైవర్ కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన భార్య మీద దాడి చేసి మా ఆస్తులు దోచుకున్నారని మాజీ మంత్రి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ కుటుంబ సభ్యుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు.

Ex-car driver who made sensational allegations against former Karnataka minister HD Revannas family members
డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు, పిటిషన్ విచారణ పై బెంచ్ కు బదిలి, డీసీఎం ?

తనతో మాట్లాడాలని నన్ను ఇంటికి పిలిచి దాడి చేశారని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ కార్తీక్ ఆరోపణలు చేశాడు. నేను కష్టపడి కొనుగోలు చేసిన ఒకే ఒక్క ఆస్తిని (భూమిని) భవానీ రేవణ్ణ కుటుంబం వారికి కావలసిన వారి పేరిట రాపించుకున్నారని, వారి పేర్లతో ఆస్తిని రాయకుంటే తనను, తన భార్యను చంపేస్తానని బెదిరించారని, మేం చెప్పినమాట వినకుంటే నీ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, తరువాత తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పడంతో తనను వేధిస్తున్నారని కారు డ్రైవర్ కార్తీక్ ఆరోపిస్తున్నాడు.

గర్భవతి అయిన నా భార్యపై భవానీ రేవణ్ణ దాడి!

ఇదంతా జరగగానే భవాని రేవణ్ణ గర్భవతి అయిన తన భార్య మీద దాడి చేసిందని భవాని రేవణ్ణ కుటుంబం మా మీద దాడులు చేశారని కారు డ్రైవర్ కార్తీక్ మీడియాకు చెప్పాడు. దాడి కారణంగా నా భార్య కిందపడిపోయిందని, అప్పుడు వారు మమ్మల్ని రహస్య ప్రాంతంలో నిర్బంధించారని, మరుసటి రోజు తనను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆస్తులను వాళ్లకు కావలసిన వారి పేర్లు మీద రాయించుకున్నారని, ఆ సమయంలో మాజీ మంత్రి, మాజీ ప్రధాని కుమారుడు రేవణ్ణ పీఏ రవి కూడా అక్కడే ఉన్నాడని, ఆ సమయంలో నా భార్యను రహస్య ప్రాంతంలోనే దాచి పెట్టారని, నువ్వు ఎదరు తిరిగితే బతికే అవకాశం లేదని తనను బెదిరించారని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ కార్తీక్ ఆరోపించాడు.

Ex-car driver who made sensational allegations against former Karnataka minister HD Revannas family members

బలవంతంగా సంతకం!

ప్రెస్ మీట్ లో ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబ సభ్యుల మీద కార్తీక్ అనేక ఆరోపణలు చేశాడు. హెచ్ డీ రేవణ్ణ, భవానీ రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై ఆరోపణలు గుప్పించిన కార్తీక్ మా ఆస్తులను వేరేవారి పేరు మీద రాయించుకున్న తరువాత తనను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించారని ఆరోపించాడు. తరువాత రాత్రి నన్ను నా ఇంటికి తీసుకెళ్ళి తన చెక్ బుక్ తీసుకురావాలని చెప్పారని, పోలీసులు నన్ను పిలుచుకుని వెళ్లి చెక్ బుక్ తీసుకురావాలని చెప్పి తరువాత తనతో బలవంతంగా చెక్కులపై సంతకం చేయించారని కార్తీక్ ఆరోపించాడు.గత ఏడాది మార్చి 17వ తేదీన రేవణ్ణ పీఏ రవి తనకు ఫోన్ చేశాడు. తాను అక్కడికి వెళ్లగా కిరణ్‌రెడ్డి అనే వ్యక్తి ఖాతా నుంచి నా ఖాతాకు రూ. 41 లక్షలు వచ్చినట్లు తెలిసింది. ఆ డబ్బులు డ్రా చేయడానికి నన్ను బ్యాంకుకు తీసుకెళ్లి సంతకం పెట్టించుకున్నారని మాజీ కారు డ్రైవర్ కార్తీక్ ఆరోపించారు.

ఇంత జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాను వెళ్లినా వారు స్పందించలేదని, సబ్ రిజిస్టర్ ఆఫీసులో తన భూమికి సంబంధించిన ఖాతా రద్దు చేయాలని ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదని కార్తీక్ విలపించాడు. దీంతో తనకు వేరే మార్గం లేకపోవడంతో ఐజీ, డీజీకి ఫిర్యాదు చేశానని హాసన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ కారు డ్రైవ కార్తీక్ ఆరోపించారు. అంతే కాకుండా ఇంత జరిగినా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ విచారణ చెయ్యలేదని, నా భార్యపై దాడి చేసి గర్భస్రావం చేశారని ఫిర్యాదు చేసినా ఇంత వరకు విచారణ జరగలేద కారు డ్రైవర్ కార్తీక్ మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ కుటుంబ సభ్యుల మీద సంచలన ఆరోపణలు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+