సైకో సంఘం అధ్యక్షుడు, భార్య బెడ్ రూమ్ న్యూడ్ వీడియోలు, ఫోటోలు ఎక్కడ పెట్టాడంటే, కసితో, పగ !

చెన్నై/కన్యాకుమారి: యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతనికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. అమ్మాయి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. అందరు దంపతులు లాగే ఇక్కడా ఆ జంట చక్కగా ఏకాంతంగా కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న నా జీవితం పబ్లిక్ అయిపోతుందని భార్య అస్సలు ఊహించలేదు. భార్యతో బెడ్ రూమ్ లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో సీక్రేట్ గా తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి చేతులు దులుపుకున్నాడు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ముట్టం ప్రాంతంలో 32 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది., దోవలై ప్రాంతానికి చెందిన సతీష్ పెరుమాళ్ (34) అనే వ్యక్తితో 11 ఏళ్ల క్రితం ఆమెకు వివాహం అయ్యింది. సతీష్ పెరుమాళ్ ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత రానురాను సతీష్ కు, అతని భార్యకు గొడవలు మొదలైనాయి. భార్య మీద అనుమానం పెంచుకున్న సతీష్ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు.

Ex-husband uploaded nude videos and photos of ex-wife on social media near Kanyakumari in Tamil Nadu.
ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడు సంవత్సరాల క్రితం సతీష్, అతని భార్య విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నారు. సతీష్ భార్యతో 9 ఏళ్ల కూతురు కలిసి జీవిస్తోంది. భార్య, కూతురికి దూరంగా ఉంటున్న సతీష్ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో భార్యతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో సతీష్ భార్యతో బెడ్ రూమ్ లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అసభ్యకరమైన వీడియో, ఫొటోలు తీశాడు.

ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకున్న సతీష్ అతని మాజీ భార్యను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. తనతో కలిసి జీవించాలని సతీష్ అతని మాజీ భార్య మీద ఒత్తిడి చేశాడు. అయితే సతీష్ బెదిరింపులను అతని మాజీ భార్య లెక్కచెయ్యలేదు. భార్య మీద రగిలిపోయిన సతీష్ ఆమె నగ్న వీడియోలు, నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి చేతులు దులుపుకున్నాడు.

బాధితురాలు కన్యాకుమారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆమె మాజీ భర్త సతీష్ మీద ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ పెరుమాళ్‌ అలియాస్ సతీష్ ను అరెస్టు చేసి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచారు. నాతో కలిసి జీవించడానికి అంగీకరించకుండా వెళ్లిపోయిన తన మాజీ భార్య ఈ సమాజంలో గౌరవంగా బతకకూడదని భావించి ఆమె అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశానని విచారణలో సతీష్ అంగీకరించాడని కన్యాకుమారి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+