ఎగ్జిట్ పోల్స్‌లో విదేశీ హస్తం : ఎస్పీ నేత ఆజాంఖాన్ సంచలనం

న్యూఢిల్లీ : ఎస్పీ నేత, రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి ఆజం ఖాన్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో విదేశీ హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలు లెక్కగట్టి .. మీడియాకు విడుదల చేశాయి. అయితే బీజేపీ తిరిగి అధికారం చేడపుతుందని మెజార్టీ సంస్థలు తెలిపాయి. దీంతో పలు పార్టీల నేతల స్పందించారు. అయితే ఆజాంఖాన్ మాత్రం మరోసారి హాట్ కామెంట్లు చేశారు.

విదేశీ హస్తం ...
రెండోసారి బీజేపీ అధికారం చేపడుతుందనే అంచనాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వారి అనుమానం కూడా నిజమని అనిపిస్తుందన్నారు ఆజాంఖాన్. దీనిని బట్టి మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి విదేశి హస్తం ఉన్నదని అర్థమవుతుందన్నారు. ఇలా జరిగితే మంచిది కాదని .. దేశంలో ప్రజాస్వామ్యం అంతమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలా ఆవిర్భవిస్తుంది అని ప్రశ్నించారు. మిగతా పార్టీలపై ప్రజలకు విశ్వసనీయత ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లో మోదీ చేసిందేంటీ అని నిలదీశారు. అన్నివర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు.

exit poll background other cooutries : azam khan

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
వివాదాస్పద నేత ఆజాంఖాన్ .. తన ప్రత్యర్థి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఖద్దర్ ఖాకీ డ్రయర్ వేసుకుంటుందని హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నిపార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. బీజేపీ నేతల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు కూడా తీసుకుంది. ఆయన ప్రచారంపై నిషేధం కూడా విధించింది. అయినా ఆజాంఖాన్ తీరు మారలేదు. ఎన్నికల సందర్భంగా రెండుసార్లు ప్రచారంపై నిషేధం విధించినా .. ఆయన వైఖరిలో మార్పు రాకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే రాజకీయాలంటే మరింత చులకన అనే భావం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+