ఎగ్జిట్ పోల్ సంస్థలకు చావుదెబ్బ.. ! ఏమాత్రం అందని హర్యానా, కాశ్మీర్ నాడి ..!

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు వచ్చేసింది. హర్యానాలో అనూహ్యంగా బీజేపీ అధికారం చేపట్టబోతుండగా.. జమ్మూ కాశ్మీర్ లోనూ అంతే అనూహ్యంగా కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి పగ్గాలు చేపట్టనుంది. అయితే ఈ రెండు ఎన్నికలపై తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఇవాళ్టి ఫలితాలు రావడంతో కాంగ్రెస్, బీజేపీ రెండూ భిన్నంగా స్పందించాల్సిన పరిస్ధితులు ఎదురయ్యాయి. అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ భవిష్యత్తూ ప్రశ్నార్ధకమైంది.

హర్యానా, జమ్మూకశ్మీర్ లో గత పదేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఓటరు నాడిని పూర్తిగా అంచనా వేయడంలో సర్వే, ఎగ్డిట్ పోల్ సంస్థలు విఫలమయ్యాయి. ఇప్పుడూ అదే రిపీట్ అయింది. హర్యానాలో ఈసారి విపక్ష కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పేశాయి. పదేళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయమని తేల్చేశాయి. ఒకట్రెండు సంస్థలు బీజేపీ మ్యాజిక్ మార్కు దాటకపోయినా అత్యధిక సీట్లు సాధిస్తుందని మాత్రం చెప్పాయి. అయితే ఇవన్నీ తప్పని ఇవాళ్టి ఫలితాలు తేల్చేసాయి. ఫలితాల్లో బీజేపీ 90 సీట్లకు గానూ 48 సాధించి హ్యాట్రిక్ పగ్గాలు చేపట్టబోతోంది.

exit polls credibility at stake after failure in jammu and Kashmir Haryana elections

మరోవైపు జమ్మూకశ్మీర్ లోనూ ఇదే పరిస్ధితి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో హంగ్ తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ తో కూడిన ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 90 సీట్ల అసెంబ్లీలో దాదాపు 50 సీట్లు సాధించి అధికారం చేపట్టేందుకు సిద్దమవుతోంది. కాశ్మీర్ లో బీజేపీ పోటాపోటీగా ఫలితాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు కూడా తప్పాయి. బీజేపీ కేవలం జమ్మూ డివిజన్ లో మాత్రమే సత్తా చాటుకుని మొత్తం మీద 29 సీట్లకు పరిమితమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+