• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ముగిసిన శశికళ ప్రయాణం -రాజకీయాలకు గుడ్ బై -అధికారిక ప్రకటన -బీజేపీతో డీల్ ఇదేనా?

|
Google Oneindia TeluguNews

దేశమంతా ఆమె పునరాగమనాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా... అత్యంత సంక్లిష్టంగా ఉండే తమిళనాడు రాజకీయాల్లో ఆమె మళ్లీ చక్రం తిప్పడం ఖాయమనే సంకేతాలు వెలువడగా.. అత్యంత శక్తిమంతులైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొనబోతోన్న ధీరురాలిగా ఆమె పేరు ప్రొజెక్ట్ చేస్తుండగా.. ఇంకొద్ది రోజుల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా.. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ షాకింగ్ ప్రకటన చేశారు..

Recommended Video

VK Sasikala Released After 4 Years In Jail

చిరంజీవి బాటలో ys sharmila -ఇతరుల్ని ముంచడానికే పార్టీ -జగన్‌ తప్పిన మాటిదే: గోనె ప్రకాశ్చిరంజీవి బాటలో ys sharmila -ఇతరుల్ని ముంచడానికే పార్టీ -జగన్‌ తప్పిన మాటిదే: గోనె ప్రకాశ్

 రాజకీయాలకు శశికళ గుడ్ బై

రాజకీయాలకు శశికళ గుడ్ బై

అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని, జనవరిలో విడుదైలన వీకే శశికళ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడం, మొన్న జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దాంతో శశికళ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ వాటన్నింటికీ రివర్సులో శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో..

 ఏనాడూ పవర్‌లో లేను..

ఏనాడూ పవర్‌లో లేను..

'జయ(దివంగత తమిళనాడు సీఎం జయలలిత) అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ నేను ఏనాడూ అధికారం, పదవి కోసం అర్రులు చాచలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండిటినీ(పదవి, అధికారం) నేను కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే, జయ స్థాపించిన పార్టీ(ఏఐఏడీఎంకే) గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది'' అని వీడ్కోలు లేఖలో శశికళ పేర్కొన్నారు.

బీజేపీతో శశికళ డీల్ ఇదేనా?

బీజేపీతో శశికళ డీల్ ఇదేనా?

జయ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ లో తాను భర్తీ అయ్యేందకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేయడం, సామదానబేధదండోపాయాలతో శశికళను జైలుకు పంపేసి, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను మచ్చిక చేసుకోవడం, దెబ్బకు అన్నాడీఎంకేను ఎన్డీఏ భాగస్వామిగా మలుచుకోవడం చకాచకా జరిగిపోయాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ అటు ఇటు అయినట్లు కనిపించడం, అన్నాడీఎంకేపై శశికళ తిరిగి పట్టు బిగిస్తే బీజేపీతో కలిసి మనగలరా? అని, ఒక వేళ శశికళ తోకజాడిస్తే మళ్లీ జైలుకు పంపేందుకూ బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా వినిపించాయి. చివరికి రాజకీయాల నుంచి, ప్రజాజీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకోవడం డీల్ లో భాగంగా జరిగిందేనా? అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ పరిణామంతో ఆమెనే నమ్ముకున్న దినకరన్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి.

మోదీ తల్లిపై అసభ్య దూషణలు -బీబీసీ షోలో ఓ కాలర్ దుస్సాహసం -సిక్కులపై చర్చలో రైతు ఉద్యమంమోదీ తల్లిపై అసభ్య దూషణలు -బీబీసీ షోలో ఓ కాలర్ దుస్సాహసం -సిక్కులపై చర్చలో రైతు ఉద్యమం

English summary
VK Sasikala, the sacked AIADMK chief who was released from jail in January and widely expected to reclaim her position at the head of Tamil Nadu's ruling AIADMK with just weeks for Assembly elections, has quit politics and public life. Sasikala wrote a printed letter dated March 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X