Be Careful:ఆ రాష్ట్రంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్..: రోగనిరోధక శక్తిని దాటుకుని దాడి చేస్తోందట..!

కోల్‌కతా: దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే నిపుణులు మరో బాంబు పేల్చారు. కరోనావైరస్ జన్యు క్రమంకు సంబంధించి B.1.618 అనే వైరస్ మూలాలను పశ్చిమబెంగాల్‌లో కనుగొన్నట్లు తెలిపారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వైరస్ రోగనిరోధక శక్తిని దాటుకుని ఆరోగ్యంకు హాని చేకూరుస్తుందని నిపుణులు చెప్పారు. B.1.618 జన్యుక్రమం కలిగిన వైరస్ మూలాలు బెంగాల్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా కనిపిస్తన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఇది అత్యంత ప్రమాదకరంగా ఉంటుండగా... ఇతర దేశాల్లో మాత్రం ఇది సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు వారు గుర్తించారు.

Recommended Video

    New Immune Escape Covid-19 Variant Found In West Bengal || Oneindia Telugu

    పశ్చిమబెంగాల్‌లో B.1.618 జన్యు క్రమం కలిగిన వైరస్ కొన్నినెలలుగా క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. B.1.617తో సమానంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. అయితే B.1.618 వైరస్ తీవ్రతపై మాట్లాడుతూ... ఈ జన్యుక్రమం గురించి ఇంకా పలు విషయాలను తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అంటే దీని ద్వారా ఇన్ఫెక్షన్లు మళ్లీ సోకుతుందా, వ్యాక్సిన్ దీనిపట్ల ప్రభావం చూపుతుందా, వ్యాక్సిన్‌లు ఈ తరహా వైరస్‌కు ఏమేరకు పనిచేస్తాయనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు డబుల్ మ్యూటెంట్ వైరస్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర,ఢిల్లీ, పంజాబ్‌లో నివసిస్తున్న ప్రజల లాలాజలం నుంచి శాంపిల్స్ సేకరించగా డబుల్ మ్యాటెంట్ (L452R + E484Q) వైరస్ గురించి మార్చి 25న నిపుణులు ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2020 నుంచి ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ మహారాష్ట్రలో తిష్ట వేసి ఉందని ఒక్కసారిగా ఇది విరుచుకుపడిందని చెబుతున్నారు.

    Experts find new Covid Variant in West Bengal,says it can escape immunity

    B.1.618 మరియు B.1.617 చెందిన వైరస్‌ బెంగాల్‌లో వేగంగా వ్యాప్తి చెందుతుందా అన్న ప్రశ్నకు దీనిపై మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో లేనందున బెంగాల్‌లో విరుచుకుపడుతుందా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేమన్నారు. గత కొన్ని నెలలుగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని చెప్పారు. దీనిపై మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని చెప్పరు. గ్లోబల్ రిపాజిటరీకి భారత్‌ నుంచి సమర్పించిన నివేదిక ప్రకారం B.1.618 వైరస్ 12శాతం ఉందని గత 60 రోజుల్లో ఈ తరహా వైరస్‌ ఎక్కువగా గుర్తించగలిగినట్లు అందులో పొందుపర్చారని నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత B.1.617 మ్యూటెంట్ 28శాతం, యూకే వేరియంట్ అయిన B.1.1.7ను గుర్తించినట్లు వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+