ఫ్లాట్‌కు పిలిచాడు: ఫస్ట్ మీటింగ్ లోనే 'సెక్స్' ప్రపోజల్, చివరకు విషాదాంతం!

ముంబై: ముక్కూ ముఖం తెలియనివాళ్లు కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమాని క్షణాల్లో స్నేహితులైపోతున్నారు. అయితే ఇందులో కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తే.. మరికొన్ని మాత్రం విషాదాంతాలుగా మిగిలిపోతున్నాయి.

తాజాగా ముంబైలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తిని నమ్మి.. అతన్ని కలిసేందుకు వెళ్లినందుకు అదే ఆమె చివరి రోజైంది.

అసలేం జరిగింది?:

అసలేం జరిగింది?:

ముంబైలోని వాశి ప్రాంతానికి చెందిన అంకిత మోరె (20) అనే యువతికి నలసోపరకి చెందిన హరిదాస్ నిర్గుడే(25) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఛాటింగ్స్ ద్వారా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది.

 ఫ్లాట్‌కు పిలిచాడు..:

ఫ్లాట్‌కు పిలిచాడు..:

చాలా రోజుల నుంచి హరిదాస్ అంకితను కలవాలనుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. దీంతో తొలిసారి కలవబోతున్నామన్న ఆత్రుతతో అంకిత కూడా ఇంట్లో చెప్పకుండానే అతని వద్దకు బయలుదేరింది.

 శృంగారానికి నిరాకరించడంతో..:

శృంగారానికి నిరాకరించడంతో..:

తీరా అతని వద్దకు వెళ్లాక అతని ప్రవర్తనకు అంకిత షాక్ తిన్నది. శృంగారం కోసం అతను బలవంతం చేయడంతో ఆమె తిరస్కరించింది. పలుమార్లు అందుకు ఆమె 'నో' చెప్పడంతో.. హరిదాస్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. షూ లేస్‌తో ఆమె గొంతును బిగించి హత్య చేశాడు.

 హత్యానంతరం..:

హత్యానంతరం..:

హత్యానంతరం ఆమె మృతదేహాన్ని ఏమి ఎరుగనట్టు అపార్ట్‌మెంటు మెట్ల కింద పడవేశాడు. మెట్ల కింద అంకిత మోరె పడి ఉండటాన్ని గమనించిన అదే అపార్టుమెంటుకు చెందిన సంతోష్.. మిగతా అపార్ట్‌మెంట్ వాసులను కూడా అలర్ట్ చేశాడు. నిజానికి ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించానని, కానీ ఆ తర్వాత ఆమె మృతి చెందిందని తెలుసుకుని షాక్ తిన్నానని సంతోష్ తెలిపాడు.

చివరకు ఒప్పుకున్నాడు..:

చివరకు ఒప్పుకున్నాడు..:

ఆ అమ్మాయి ఎవరో తమకు తెలియదని అంతా చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంటుకు సీసీటీవి కెమెరా కూడా లేకపోవడంతో.. ఇదేదో మిస్టరీలా ఉందనుకున్నారు.

కానీ హరిదాస్ నిర్గుడే ఫ్లాట్ లోకి వెళ్లి చూడగానే పోలీసులకు అంతా అర్థమైపోయింది. అతని ఫ్లాట్ లో కొన్ని రక్తపు మరకలను కూడా పోలీసులు గుర్తించారు. గట్టిగా ప్రశ్నించడంతో తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. శృంగారానికి నిరాకరించినందువల్లే హత్య చేయాల్సి వచ్చిందని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+