వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sisters: శోభనం రోజు అక్కాచెల్లికి ఆ పరీక్షలు, ఒకరు ఫెయిల్, పతివ్రతలు కాదా ?, అంతే, తీర్పు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/కొల్లాపూర్: నాలుగు నెలల క్రితం అక్కా, చెల్లికి గ్రాండ్ గా పెళ్లి చేశారు. సొంత అన్నదమ్ములు ఆ యువతులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికొడుకుల తల్లి ఇంటికి వచ్చిన కోడళ్లకు కన్యత్వ పరీక్షలు చేయించింది. అక్కాచెల్లికి తెల్లటి దస్తులు కట్టి అన్నదమ్ములతో శోభనం జరిపించారు. వీళ్ల మూడనమ్మకాల పరీక్షల్లో ఒక యువతి కన్యకాదని కన్యత్వ పరీక్షలు చేసిన పెద్దలు డిసైడ్ చేశారు. మీరు పతివ్రతలు కాదు అంటూ ఇద్దరిని పుట్టింటికి తరిమేశారు. విడాకులు ఇస్తారా, ఆత్మహత్యలు చేసుకుని చస్తారా అంటూ అత్తంటి వాళ్లు, పంచాయితీలు చేసిన కుల పెద్దలు వేధింపులకు గురి చెయ్యడం కలకలం రేపింది. అక్కాచెల్లి న్యాయపోరాటానికి దిగడంతో అసలు కథ మొదలైయ్యింది.

Khiladi: భర్తకు బాయ్ బాయ్, అత్త ఆధార్ కార్డుతో కోడలు ఏం చేసిందంటే, బాయ్ ఫ్రెండ్ తో ?Khiladi: భర్తకు బాయ్ బాయ్, అత్త ఆధార్ కార్డుతో కోడలు ఏం చేసిందంటే, బాయ్ ఫ్రెండ్ తో ?

 కొల్లాపూర్ సిస్టర్స్, బ్రదర్స్ పెళ్లి

కొల్లాపూర్ సిస్టర్స్, బ్రదర్స్ పెళ్లి

మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో నివాసం ఉంటున్న అన్నదమ్ములకు కొల్లాపూర్ సమీపంలోని ఓ ఊరిలో నివాసం ఉంటున్న సొంత అక్కాచెల్లికి 2020 నవంబర్ 27వ తేదీన పెళ్లి చేశారు. రెండు కుటుంబాలు కంజర్ భట్ కులానికి (జాట్ పంచాయితీలోని ఓ వర్గం) చెందినవారు కావడంతో ఆ కులం సాంప్రధాయం ప్రకారం పెళ్లి జరిగింది.

 శోభనం రోజు టెస్టులు

శోభనం రోజు టెస్టులు

అక్కాచెల్లి పవిత్రంగా ఉన్నారా ? లేదా ?, వారి హైమెన్ చెక్కుచెదరకుండా ఉందా ?, లేదా ? అని కన్యత్వ పరీక్షలు చేయించాలని పెళ్లికొడుకుల తల్లి నిర్ణయించింది. ఇంటికి వచ్చిన కొత్త కోడళ్లకు ఎలాంటి డిజైన్లు లేని తెల్లటి దస్తులు కటించి ఆ రోజు రాత్రి కొడుకులతో శోభనం జరిపించింది. కంజర్ భట్ కులం సాంప్రధాయం ప్రకారం వారికి కన్యత్వ పరీక్షలు జరిపించారు.

 ఒకరు ఫెయిల్..... ఒకరు పాస్

ఒకరు ఫెయిల్..... ఒకరు పాస్

పెళ్లికొడులకు ఆ రోజు రాత్రి వాళ్లవాళ్ల భార్యలతో శోభనం జరుపుకుని జల్సా చేశారు. మరుసటి రోజు కంజర్ భట్ కుల పెద్దలు పెళ్లికుమార్తెల దుస్తులు పరిశీలించారు. అక్కాచెల్లిలో ఒకరి దుస్తులకు మాత్రం రక్తపు మరకలు అయ్యాయని, ఆమె మాత్రం పవిత్రంగా ఉన్నారని, ఒకరి దుస్తులకు ఎలాంటి రక్తపు మరకలు కాలేదని, ఆమె కన్యకాదని కుల పెద్దలు తేల్చి చెప్పారు. కుల పెద్దల జరిపిన కన్యత్వ పరీక్షల్లో ఒక కోడలు మంచిది కాదని తెలుసుకున్న అత్త చిందులు వేసింది.

 మీరు పతివ్రతలు కాదా ?, మీ ఫ్యామిలీ ఇంతేనా

మీరు పతివ్రతలు కాదా ?, మీ ఫ్యామిలీ ఇంతేనా

ఒక కోడలు మంచిది, మరో కోడలు కన్యకాదని తెలుసుకున్న అత్త ఇద్దరిని మెడపట్టి ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని బెదిరించింది. మీరు పతివ్రతలు కాదని, మీలో ఒకరికి ఇంతకు ముందే అక్రమ సంబంధాలు ఉన్నాయని, మీరు నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదని రాద్దాంతం చేసింది. కొందరు పెద్దలు పంచాయితీ చేసి అత్తకు సర్దిచెప్పారు. అయినా ప్రతిరోజు ఇంట్లో అత్త ఇద్దరు కోడళ్లకు టార్చర్ పెట్టింది.

 విడాకులు ఇచ్చేయాలి

విడాకులు ఇచ్చేయాలి

చివరికి ఇద్దరి కోడళ్లను పుట్టింటికి పంపించేయాలని అత్త ఆమె ఇద్దరు కొడుకులను రెచ్చగొట్టింది. రెండు నెలలు భార్యలతో ఎంజాయ్ చేసిన వారి భర్తలు తల్లిమాటకు తల ఊపారు. పుట్టింటి నుంచి రూ. 10 లక్షలు తీసుకువస్తే మీతో కాపురం చేస్తామని, లేదంటే లేదని పెళ్లి కొడుకులు తేల్చి చెప్పారు. చివరికి అక్కాచెల్లిని ఇంటి నుంచి బటకు గెంటేసి మీరు మాకు విడాకులు ఇచ్చేయాలని తేల్చి చెప్పారు. కొందరు కుల పెద్దలు కూడా పెళ్లి కొడుకులకే మద్దతు ఇవ్వడంతో అక్కాచెల్లి ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయారు.

 గుడిలో పంచాయితీకి రూ. 40 వేలు లంచం

గుడిలో పంచాయితీకి రూ. 40 వేలు లంచం

పెళ్లికుమార్తెల తల్లి జాట్ పంచాయితీ కుల పెద్దలను ఆశ్రయించి న్యాయం చెయ్యాలని వేడుకుంది. గుడిలో పంచాయితీ పెట్టి సమస్య పరిష్కరించాలంటే మాకు రూ. 40 వేలు లంచం ఇవ్వాలని ఫిబ్రవరి నెలలో జాట్ కుల పెద్దలు నవవధువుల తల్లిదండ్రులకు తేల్చిచెప్పారు. రూ. 40 వేలు ఇచ్చిన తరువాత గుడిలో జాట్ పంచాయితీ జరిగింది.

 పెదరాయుడు తీర్పు కాదు..... పనికిమాలిన తీర్పు

పెదరాయుడు తీర్పు కాదు..... పనికిమాలిన తీర్పు

గుడిలో పంచాయితీ చేసిన పెద్దలు పెళ్లి కొడుకులకే మద్దతుగా మాట్లాడారు. మీరు వెంటనే విడాకులు ఇచ్చేయాలని, మీ దారిమీరు తీసుకోవాలని, మీలో ఒకరికి పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉందని, మిమ్మల్ని మా కులం నుంచి వెలివేస్తున్నామని, మా కులంతో మీకు ఇక ముందు ఎలాంటి సంబంధాలు ఉండవని పంచాయితీలో పనికిమాలిన పెద్దలు తీర్పు చెప్పారు.

 అక్కా చెల్లి ఏం చేశారంటే ?

అక్కా చెల్లి ఏం చేశారంటే ?

పంచాయితీ పెద్దల తీర్పుతో విసిగిపోయిన అక్కాచెల్లి కోల్లాపూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో అత్తా, వాళ్ల భర్తల మీద, పంచాయితీ పెద్దల మీద కేసు పెట్టారని ది ఇండియన్ ఎక్సె ప్రెస్ కథనం ప్రచురించింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించి అక్కాచెల్లికి టార్చర్ పెట్టారని కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలోని అనేక కులాలు ఇలాంటి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారని అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉంది.

English summary
Virginity test: In a shocking incident reported from Maharashtra’s Kolhapur, two sisters, married in November last year, are presently facing divorce orders after one of them failed to clear ‘virginity test’, a report stated on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X