వాళ్లని కూడా వదలరా.. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లతో ఫేక్ అకౌంట్లు !
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. భారత త్రివిధ దళాలకి చెందిన ఈ ఇద్దరు అధికారులు "ఆపరేషన్ సింధూర్" అనంతరం మీడియా సమావేశాల్లో పాలు పంచుకుంటూ, కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక చర్యల గురించి వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ధైర్యసాహసాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే, వీరి పేర్ల పాపులారిటీని వాడుకొని సోషల్ మీడియాలో కొందరు నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వీరి పేర్ల మీద ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వీటిలో చాలా ఖాతాలకు బ్లూ టిక్ ఉండటంతో అవే అధికారిక ఖాతాలుగా నమ్మి నెటిజన్లు సైతం ఫాలో అవుతున్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర సమాచార శాఖకి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ఈ ఖాతాలన్నీ నకిలీవని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వ శాఖల ధృవీకరించిన ఖాతాలనే అనుసరించాలని సూచించింది. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పాత్రల్ని గౌరవించడంతో పాటు, అపోహలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పీఐబీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications