బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fake: చాపలు అమ్మినట్లు నకిలీ పాస్ పోర్ట్ లు అమ్మేస్తున్న అమీన్ సేఠ్, విదేశీయులు, క్రిమినల్స్, స్కెచ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: విదేశీయులు, క్రిమినల్స్ కు నకిలి పాస్ పోర్టులు తయారు చేసి ఇచ్చి వారిని దేశం దాటి పంపిస్తున్న ముఠా పోలీసులకు చిక్కిపోయింది. పాస్ పోర్టు ఏజెంట్ తో పాటు విదేశీయులు ఈ కేసులో అరెస్టు అయ్యారు. పాస్ పోర్ట్ కు అవసరం అయ్యే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుతో పాటు అవసరం అయిన అన్ని పత్రాలను పాస్ పోర్ట్ ఏజెంట్ తయారు చేస్తున్నాడని వెలుగు చూసింది. జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ యజమానితో లింక్ పెట్టుకున్న పాస్ పోర్ట్ ఏజెంట్ ఇప్పటికే 50 మందికి అక్రమంగా నకిలి పాస్ పోర్టులు తయారు చేసి ఇచ్చాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !

పాస్ పోర్ట్ ఏజెంట్

పాస్ పోర్ట్ ఏజెంట్

బెంగళూరు నగరంలోని లింగరాజపురంలో అమీన్ సేఠ్ అలియాస్ అమీన్ అనే పాస్ పోర్ట్ ఏజెంట్ నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి అమీన్ పాస్ పోర్ట్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. పాస్ పోర్ట్ ఏజెంట్ అమీన్ కు నగరంలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయని వెలుగు చూసింది.

శ్రీలంక ప్రజలకు పాస్ పోర్ట్

శ్రీలంక ప్రజలకు పాస్ పోర్ట్

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో చాలా మంది శ్రీలంక ప్రజలు అక్రమంగా భారత్ కు వచ్చేశారు. శ్రీలంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఆదేశం ప్రజలు మళ్లీ శ్రీలంక వెళ్లడానికి సిద్దం అయ్యారు. అయితే వీసాలు ఇవ్వడానికి శ్రీలంక ప్రభుత్వం నిరాకరించడంతో కొందరు శ్రీలంక దేశ ప్రజలు బెంగళూరులోని పాస్ పోర్ట్ ఏజెంట్ అమీన్ సేఠ్ ను సంప్రధించారు.

అంతా ఓకే అయ్యే సమయంలో అరెస్టు

అంతా ఓకే అయ్యే సమయంలో అరెస్టు

శ్రీలంకకు చెందిన సెల్వీ, రవికుమార్, షీజు, మణివేల్, విశాల్ నారాయణ్ అనే వ్యక్తులకు నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేసే పనిలో అమీన్ సేఠ్ బిజీ అయిపోయాడు. అమీన్ విదేశీయులకు నకిలి పాస్ పోర్టులు తయారు చేస్తున్నాడని సమాచారం అందుకున్న బెంగళూరులోని బసవనగుడి పోలీసులు రంగంలోకి దిగారు.

క్రిమినల్స్ ఎస్కేప్

క్రిమినల్స్ ఎస్కేప్

శ్రీలంకకు చెందిన సెల్వీ, రవికుమార్, షీజు, మణివేల్, విశాల్ నారాయణ్, పాస్ పోర్టు ఏజెంట్ అమీన్ సేఠ్, జిరాక్స్ సెంటర్ యజమానితో సహన మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కమగళూరుకు చెందిన రౌడీషీటర్ సాదిక్, అతని సోదరుడి మీద 36 కేసులు ఉన్నాయని, వారు దేశం వదిలిపారిపోవడానికి అమీన్ నకిలీ పాస్ పోర్ట్ తయారు చేసి ఇచ్చాడని పోలీసులు చెప్పారు.

రూ. 1. 50 లక్ష్లలకు నకిలి పాస్ పోర్ట్ సేల్

రూ. 1. 50 లక్ష్లలకు నకిలి పాస్ పోర్ట్ సేల్

ఇప్పటి వరకు అమీన్ 50 మందికి పైగా నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేసి ఇచ్చాడని, అందులో క్రిమినల్స్ కూడా ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు. అమీన్ ఒక్కొక్కరి దగ్గర రూ. 1 లక్ష నుంచి రూ. 1. 50 లక్షలు వసూలు చేసి నకిలి పాస్ పోర్ట్ లు తయారు చేసి ఇస్తున్నాడని, ఇప్పటికే ఇతను అనేకసార్లు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు.

English summary
Fake: Nine people including foreigner arrested for getting passports with fake ID cards in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X