ప్రతి ఎన్నికల్లో పోటీ',గెలిచేవరకు పోటీ '
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 73 ఏళ్ళ ఫక్కాడ్ బాబా నామినేషన్ దాఖలు చేశాడు. అయితే వింతేముందని అనుకొంటున్నారు. 73 ఏళ్ళ ఈ భాబా 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 73 ఏళ్ళ ఫక్కాడ్ బాబా నామినేషన్ దాఖలు చేశాడు. అయితే వింతేముందని అనుకొంటున్నారు. 73 ఏళ్ళ ఈ భాబా 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు.కాని , ఇప్పటివరకు ఒక్క ఎన్నికల్లో కూడ ఆయన గెలువలేదు.
ఉత్తర్ ప్దదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది.అయితే ఫక్కాడ్ బాబా అనే తొలిరోజు నామినేషన్ దాఖలు చేశాడు. గతంలో ఆయన సాక్షిమహరాజ్ పై కూడ పోటీచేశాడు.
శంకరాచార్య ఆదేశం మేరకు ఆయన పోటీచేస్తున్నాడట. అయితే 20 దఫా తాను పోటీచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.గెలిచేవరకు తాను పోటీచేస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఫక్కాడ్ బాబా తన నామినేషన్ దాఖలు చేశాడు.మంత్రోఛ్చారణ చేసుకొంటూ ఎన్నికల కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశాడు.
పదివేల రూపాయాల విరాళంతో నామినేషన్ దాఖలు
మధుర అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడానికి దాతలు బాబాకు పదివేల రూపాయాలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో ఆయన నామినేషన్ ను దాఖలు చేశారు.
1977 నుండి ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు.ఒక్క దఫా కూడ ఆయన గెలవలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు ఆయనకులేవు. రాత్రిపూట ఎక్కడ స్థలం దొరికితే అక్కడే నిద్రపోతాడు. దేవాలయాల్లో సేదతీరుతాడు.
తన వద్ద ఉన్న డబ్బులను ఆయన ఎన్నికల కోసమే ఖర్చు చేస్తాడు.శంకరాచార్యులు కలలో కన్పించి ఎన్నికల్లో పోటీచేస్తూనే ఉండాలని ఆదేశించాడని, ఈ ఆదేశాలకు అనుగుణంగానే పోటీచేస్తున్నట్టు ఈ బాబా చెబుతున్నాడు. తాను విజయం సాధిస్తే వ్యవస్థనే మార్చివేస్తానని ఆయన చెబుతున్నారు. 1991 లో బిజెపి అభ్యర్థి సాక్షి మహరాజ్ పై ఆయన పోటీచేశాడు. ఆ సమయంలో ఫక్కాడ్ బాబాకు 8వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఆయనకు వచ్చిన ఓట్లలో ఇవే అత్యధికం.. అయితే తాను 20వ, దఫా పోటీచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications