Lovers: పండుగ పూట, పెళ్లికి నో చెప్పిన ఫ్యామిలీ, ఫస్ట్ ప్రియురాలు, వెంటనే ప్రియుడు, జీవితం రివర్స్ !
చెన్నై/రాణిపేట్: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన యవతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలీకుండా స్నేహితుల సహాయంతో ప్రేమికులు రహస్యంగా కలుసుకున్నారు. ఎంతకాలం ఇలా రహస్యంగా కలుసుకుందామని, పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రేమికులు మాట్లాడుకున్నారు. మేము పెళ్లి చేసుకుంటామని ప్రేమికులు ఇద్దరూ వారివారి ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికులకు పెళ్లి చెయ్యడానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. అంతే జీవితంపై విరక్తి చెందిన ఇంటర్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న యువకుడు ఆవేదనతో కుంగిపోయాడు. ప్రియురాలు లేని జీవితం ఊహించుకోలేనని స్నేహితులకు చెప్పిన ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

చిన్ననాటి స్నేహితులు
తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలోని అమ్మూరు సమీపంలోని వెలంబదూరులో సుబ్రమణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుబ్రమణి 18 ఏళ్ల కూతురు అదే ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సుబ్రమణి ఇంటి సమీపంలోనే నివాసముంటున్న కదిరిల్ క్యాటరింగ్ పని చేసేవాడు. సుబ్రమణి కూతురు, కదిరివేల్ కు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.

రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులు
చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన యవతి, కదిరివేల్ తరువాత ప్రేమించుకున్నారు. క్యాటరింగ్ పని మానేసిన కదిరివేల్ తరువాత చెన్నై వెళ్లి చిన్న ఉద్యోగంలో చేరాడు. సొంత ఊరు వస్తున్న కదిరివేల్ అతని ప్రియురాలని కలిసేశాడు. పెద్దలకు తెలీకుండా స్నేహితుల సహాయంతో కదిరివేల్ అతని ప్రియురాలిని రహస్యంగా కలుసుకునేవాడు.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు
ఎంతకాలం ఇలా రహస్యంగా కలుసుకుందామని, పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని కదిరివేల్, అతని ప్రియురాలు మాట్లాడుకున్నారు. మేము పెళ్లి చేసుకుంటామని ప్రేమికులు ఇద్దరూ వారివారి ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికులకు పెళ్లి చెయ్యడానికి కదిరివేల్ తల్లిదండ్రులు, యువతి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు.

ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
కదిరివేల్ తో మా అమ్మాయి తిరుగుతోందని అందరికి తెలిసిపోయిందని సుబ్రమణి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. కూతురిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. అమ్మాయి కాలేజ్ కు వెళ్లకుండా సుబ్రమణి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇంట్లో ఉంటరిగా ఉన్న ప్రియులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చెట్టుకు ఉరి వేసుకున్న ప్రియుడు
పెళ్లి జరగదని జీవితంపై విరక్తి చెందిన ఇంటర్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె ప్రియుడు కదిరివేల్ కు స్నేహితులు సమాచారం ఇచ్చారు. తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న కదిరివేల్ ఆవేదనతో కుంగిపోయాడు. ప్రియురాలు లేని జీవితం ఊహించుకోలేనని స్నేహితులకు చెప్పిన ప్రియుడు కదిరివేల్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెళ్లి చెయ్యడానికి నిరాకరించడంతో మొదట ప్రియురాలు, తరువాత ప్రియుడు కదిరివేల్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి. అమ్మాయి కుటుంబంలో ఒక్కరైనా అంగీకరించి ఉంటే ఆ అమ్మాయిని కదిరివేల్ ధైర్యంగా పెళ్లి చేసుకుని చెన్నై వెళ్లి సంతోషంగా ఉండేవాడని, అలా జరగలేదని, మొండి పట్టుదలతో పెళ్లి చెయ్యడానికి కుదరదని చెప్పడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారని వారి స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications