Family: మహారాష్ట్రలో చరిత్ర సృష్టించిన మామా అల్లుడు, రామ్ రాజ్ అక్కడ, రాహుల్ ఇక్కడ బాస్, పార్టీలు !
ముంబాయి/థానే: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని కూల్చేసిన ఏక్ నాథ్ షిండే బీజేపీ నాయుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి మెజారీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే కొత్త ప్రభుత్వం బలప్రదర్శనకు సిద్దం అయ్యింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం రాహుల్ నావేర్కర్ ను స్పీకర్ గా ఎన్నుకున్నారు. బీజేపీకి చెందిన రాహుల్ నావేర్కర్ ఇప్పుడు మహారాష్ట్ర కొత్త స్పీకర్. అయితే శాసన సభ స్పీకర్ గా రాహుల్ నావేర్కర్ ఉండటం పెద్ద విషయం కాదు. శాసన మండలిలో సభాధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ? అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాహుల్ నావేర్కర్ అసెంబ్లీ స్పీకర్ అయితే, శాసన మండలిలో ఆయన మామ సభాధ్యక్షుడిగా ఉన్నారు. శాసనసభ, శాసన మండలిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక పదవుల్లో ఉండటం మహారాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ లో విజయం సాధించింది.

కొత్త స్పీకర్ కోసం వేట
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని కూల్చేసిన ఏక్ నాథ్ షిండే బీజేపీ నాయుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి మెజారీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే కొత్త ప్రభుత్వం బలప్రదర్శనకు సిద్దం అయ్యింది. మనకు అనుకూలంగా ఉండే స్పీకర్ ఎవరు అంటూ ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ అనేక మంది పేర్లు పరిశీలించారు.

బీజేపీకి చెందిన రాహుల్ నావేర్కర్
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం రాహుల్ నావేర్కర్ ను స్పీకర్ గా ఎన్నుకున్నారు. 164 ఓట్లతో బీజేపీకి చెందిన రాహుల్ నావేర్కర్ మహారాష్ట్ర స్పీకర్ గా విజయం సాధించారు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్థిగా స్పీకర్ ఎన్నికల్లో పోటీ చేసిన రాజన్ సాల్వికి కేవలం 107 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన ఓడిపోయారు. విప్ జారీ చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది.

రికార్డు సృష్టించిన రాహుల్ నావేర్కర్
దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న స్పీకర్ గా రాహుల్ నావేర్కర్ రికార్డు సృష్టించారు. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ వయసు కేవలం 45 సంవత్సరాలు. దేశంలోని అన్ని అసెంబ్లీల్లో అతి తక్కువ వయసు ఉన్న స్పీకర్ రాహుల్ నావేర్కర్ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా చెప్పారు.

రాహుల్ నావేర్కర్
ముంబాయిలోని కోలబా శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే రాహుల్ నావేర్కర్ ఎమ్మెల్యే అయిన మొదటిసారే స్పీకర్ అయిపోయారు. మొదట శివసేనలో పని చేసిన రాహుల్ నావేర్కర్ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి 2014లో ఎన్ సీపీలో చేరారు, మావల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి శివసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు,

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే.... అప్పుడే స్పీకర్..... సుడితిరిగింది
2019 మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్బంగా ఎన్సీపీకి రాజీనామా చేసిన రాహుల్ నావేర్కర్ బీజేపీలో చేరి కోలబా నియోజక వర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ జగవత్ ను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం రాహుల్ నావేర్కర్ కు ఏమాత్రం లేదు. మంచి స్పోక్ పర్సన్ అయిన రాహుల్ నావేర్కర్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత మహారాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ కూడా అయిపోయారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే ? మామ ఎన్సీపీ, అల్లుడు బీజేపీ
బీజేపీకి చెందిన రాహుల్ నావేర్కర్ ఇప్పుడు మహారాష్ట్ర కొత్త స్పీకర్. అయితే శాసన సభ స్పీకర్ గా రాహుల్ నావేర్కర్ ఉండటం పెద్ద విషయం కాదు. శాసన మండలిలో సభాధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ? అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాహుల్ నావేర్కర్ అసెంబ్లీ స్పీకర్ అయితే, శాసన మండలిలో ఆయన మామ రామ్ రాజ్ నాయక్ సభాధ్యక్షుడిగా ఉన్నారు.

మామా అల్లుడి చేతిలో పవర్ ఫుల్ పోస్టులు
మహారాష్ట్ర శాసనసభ రాహుల్ నావేర్కర్ స్పీకర్ గా, మహారాష్ట్ర శాసన మండలిలో రామ్ రాజ్ నాయక్ సభాధ్యక్షుడిగా ఉన్న పదవుల్లో ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభా, శాసన మండలిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక పదవుల్లో ఉండటం మహారాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ లో విజయం సాధించడంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం మంచి ఊపుమీద ఉంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications