భార్య ఆత్మహత్య, మద్యం మత్తులో మరదలికి లైంగిక వేధింపులు, టార్చర్, పక్కాప్లాన్ తో హత్య చేసిన ఫ్యామిలీ!

చెన్నై: లైంగిక వేధింపు కారణంగా రైతును అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన మహిళతో సహా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో నిత్యం మద్యం సేవించి వచ్చి మరదలితో అసభ్యంగా ప్రవర్తించి ఆమెకు చిత్ర హింసలు పెడుతున్న వ్యక్తిని తమిళనాడులోని సేలం జిల్లాలో హత్య చేశారు. రైతును హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన మహిళను, ఆమె తండ్రిని, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

భార్య ఆత్మహత్య

భార్య ఆత్మహత్య

తమిళనాడులోని సేలం జిల్లా గెంగవల్లి సమీపంలోని ఆనయాంపట్టిలో రామర్ (41), శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు, వీరికి 9వ తరగతి చదువుతున్న విష్ణు (15), 6వ తరగతి చదవుతున్న విఘ్రేష్ (9) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రామర్ వ్యవసాయం చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. రామర్, శాంతి దంపతులు, ఇద్దరు పిల్లలు కలిసి జీవించేవారు. కుటుంబ సమస్యలతో నాలుగు నెలల క్రితం శాంతి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది.

తాగుడుకు బానిస

తాగుడుకు బానిస

భార్య శాంతి ఆత్మహత్య చేసుకున్న తరువాత రామర్ మద్యంకు బానిస అయ్యాడు. ఇద్దరు కుమారులను పట్టించుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ ఫుల్ గా మద్యం సేవిస్తున్న రామర్ ఎక్కడపడితో అక్కడ పడిపోయేవాడు. రామర్ కుటుంబ సభ్యులు అతని ఇద్దరు కుమారులను చూసుకుంటున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి !

ఇంటి నుంచి బయటకు వెళ్లి !

మూడు రోజుల క్రితం రామర్ ఇంటి నుంచి బమటకు వెళ్లి తరువాత తిరిగిరాలేదు. రామర్ కోసం ఎదురు చూసిన అతని తమ్ముడి భార్య మంజుల, కుమారుడు విష్ణు అతని కోసం వెతుక్కుంటూ వెళ్లారు. సొంత పొలంలోని బావి దగ్గర రామర్ రక్తపుమడుగులో శవమై కనిపించాడు. రామర్ ఎలా చనిపోయాడో అర్థంకాక అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

తమ్ముడి భార్యకు లైంగిక వేధింపులు

తమ్ముడి భార్యకు లైంగిక వేధింపులు

గెంగవల్లి డీఎస్పీ రాజు, ఇన్ స్పెక్టర్ ఉమా శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని రామర్ ఎలా చనిపోయాడు అని పరిశీలించారు. మొదట రామర్ విద్యుదాఘాతంతో మరణించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన రామర్, అతని చిన్నాన కుమారుడు కలియమూర్తి పొలం పక్కన పక్కనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పొలం దగ్గర ఉన్న తమ్ముడు కలియమూర్తి భార్య కనక (34)తో మద్యం మత్తులో వచ్చిన రామర్ అసభ్యంగా ప్రవర్తించి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూసింది.

మరదలు సహించలేక !

మరదలు సహించలేక !

మద్యం మత్తులో తమ్ముడి భార్య కనకను లైంగిక వేధింపులకు గురి చేసిన రామర్ ను మొదట పెద్దలు హెచ్చరించి వదిలేశారు. భార్య శాంతి ఆత్మహత్య చేసుకుందని ఆవేదనతో రామర్ ఇలా ప్రవర్తించాడని అతని బంధువులు మొదట జాలి చూపించారు. అయితే ప్రతిరోజూ రామర్ మద్యం మత్తులో వచ్చి మరదలు కనకును లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు.

చంపేసిన మహిళ ఫ్యామిలీ

చంపేసిన మహిళ ఫ్యామిలీ

కనక భర్త కలియమూర్తి, ఆమె తండ్రి రామన్ (60) పొలం దగ్గరకు వెళ్లారు. రామర్ కనకను వేధిస్తున్నాడని తెలుసుకుని సహనం కోల్పోయిన రామర్, కలియమూర్తి కలిసి రామర్ ను చితకబాది కర్రతు, ఇనుప రాడ్ లతో దాడి చేసి హత్య చేశారు. రామర్ హత్యకు కనక కూడా సహకరించిదని పోలీసులు గుర్తించారు. రామర్ ను హత్య చేసిన కనక ఆమె భర్త కలియమూర్తి, ఆమె తండ్రి రామర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+