ముస్లింల వల్లే, వెళ్లిపోండి: కతియార్,‘నీ తండ్రి జాగీరా?’అంటూ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం
Recommended Video

న్యూఢిల్లీ: ముస్లింలు దేశంలో ఉండాల్సిన పనిలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ టీవీ ఛానెళ్లతో మాట్లాడుతూ.. ముస్లింల కారణంగానే దేశం విడిపోయిందన్నారు. వారి భూభాగంవాటా వారికి దక్కినందున.. పాకిస్థాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలని అన్నారు.
వందేమాతరాన్ని గౌరవించని వారిని, జాతీయ పతాకాన్ని అవమానం చేసేవారిని, పాకిస్థాన్ జెండాను ఎగురవేసేవారిని శిక్షించేలా పార్లమెంటులో కొత్తచట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలోని ముస్లింలను పాకిస్తానీలు అని పిలిస్తే శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై వినయ్ కతియార్ ఈ విధంగా స్పందించారు.
నీ తండ్రి జాగీరా?: ఫరూక్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం
కాగా, ముస్లింలందరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లిపోవాలన్న బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సీరియస్ అయ్యారు. ఇదేమైనా కటియార్ అయ్య జాగీరా.. ఇది మనందరి దేశం అని అబ్దుల్లా ఘాటుగా వ్యాఖ్యానించారు.
#WATCH 'Kya ye Katiyar ke baap ka desh hai? Ye hum sab ka desh hai', says Farooq Abdullah on Vinay Katiyar's comment pic.twitter.com/de30EMc9CM
— ANI (@ANI) February 8, 2018
కతియార్‌కు ఇలాంటి చెత్త వాగుడు అలాటేనని, రోజూ ఇలాగే మాట్లాడుతుంటారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇది మత హింస కాదు. ఎందుకంటే మతాలు మనకు ప్రేమ, శాంతిని వ్యాప్తి చేయాలని మాత్రమే చెబుతాయి అని ఫరూక్ అన్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications