వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూతుర్ని ఇంట్లో వదిలిన తల్లి: తండ్రి రేప్‌యత్నం, గతంలోను
న్యూఢిల్లీ: కామంతో కళ్లు మూసుకుపోయి పీకల దాకా మద్యం తాగి కన్నకూతురిపైనే అత్యాచారం జరిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలోని పాలం ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ఓ వ్యక్తి మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లి 17 ఏళ్ల కూతుర్ని ఇంట్లో వదిలి సోదరుడి ఇంటికి వెళ్లింది.

పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి నరరూప రాక్షసుడిగా మారి కన్న కూతురిపైనే అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక అలారం మోగించడంతో స్థానికులు వచ్చి తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
నిందితుడు గతంలోనూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడైన తండ్రిని రిమాండుకు పంపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!