పోటు మీదున్న బంగాళాఖాతం: ఫెంగల్ తుఫాన్ తీరం దాటేది ఇక్కడే: 90 కి.మీ వేగం..!!
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్.. రెండు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంపై పంజా విసురుతోంది. తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిల్లో అల్లకల్లోలం రేపుతోంది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై దీని ప్రభావం అతి తీవ్రంగా ఉంటోంది. భారీ వర్షాలకు కారణమౌతోంది.
తమిళనాడు, పుదుచ్చేరిల్లో మూడు- నాలుగు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని తీవ్రత 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతోంది. చెన్నైకి ఈశాన్య దిశగా 210, పుదుచ్చేరికి ఈశాన్య దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ఈ మధ్యాహ్నం తమిళనాడు ఉత్తర ప్రాంతం- పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మామళ్లాపురం మధ్య తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రవ గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వరకు పెరుగుతుందని పేర్కొంది.
దీని ప్రభావం.. ఇప్పటికే తమిళనాడుపై పడింది కూడా. చెన్నైలో శుక్రవారం సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కాళ్లకురిచి, కడలూర్ జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల అతలాకుతలమౌతోన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి.

తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యలో ఆయా జిల్లాలల్లో పాఠశాలలకు సెలవును ప్రకటించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
#WATCH | Puducherry | Rough sea and gusty wind witnessed in many coastal areas as impact of cyclone Fengal
— ANI (@ANI) November 30, 2024
According to the Indian Meteorological Department (IMD), Cyclone Fengal will hit the coastal area by today evening. pic.twitter.com/gW4LAXIojd
రామనాథపురం, కారైకల్, పుదుచ్చేరి, తూత్తుకుడి, రామేశ్వరం, మైలాడుథురై జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఎగిసిపడుతున్నాయి. హోరు మంటూ తుఫాన్ శబ్దం భీతిగొలుపుతోంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించింది తమిళనాడు ప్రభుత్వం. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసింది.
#WATCH | Chennai | Due to the impact of cyclone Fengal, many coastal areas witnessed changes in weather with high tides and rain.
— ANI (@ANI) November 30, 2024
According to the Indian Meteorological Department (IMD), Cyclone Fengal will hit the coastal area by today evening. pic.twitter.com/r8lW88kLwE
ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications