PhonePeలో కీలక మార్పులు- ఇకపై బ్యాంకింగ్ సేవలు కూడా..
ముంబై: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే మరింత అప్‌డేట్ అయింది. కొత్తగా అకౌంట్ అగ్రిగేటర్ సేవలను ప్రవేశపెట్టింది. యూజర్లు ఇకపై తమ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు బదిలీ చేసుకునే వెసలుబాటును కల్పించింది. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లోన్, ఇన్సూరెన్స్ వివరాలన్నింటినీ.. షేర్ చేసుకోవచ్చు.
దీనికోసం ఫోన్‌పె యాజమాన్యం పలు బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయా సేవలన్నింటినీ ఏకీకృతం చేసింది. ఈ యాప్ ద్వారా వేర్వేరు సర్వీసులను క్షణాల్లో పొందవచ్చని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు, ఎల్ఐసీ, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్ వంటి వందకుపైగా ఆర్థిక సంస్థల సేవలను ఒకే యాప్ ద్వారా అందించనున్నట్లు పేర్కొంది.

బ్యాంకుల నుంచి స్టేట్‌మెంట్లను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను పొందే వెసలుబాటు కల్పించింది. తమ సేవలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఫోన్‌పె టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి తెలిపారు.
యస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ల సర్వీసులను కూడా అగ్రిగేట్ చేసినట్లు వివరించారు. బ్యాంకింగ్ తరహా సేవలను అందించడానికి 2021 ఆగస్టు 26వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చినట్లు రాహుల్ చారి తెలిపారు. ఈ సౌకర్యం వల్ల యూజర్లు ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ తెలుసుకోవచ్చని, వాటి యాక్సెస్ పొందవచ్చని అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications