గొప్పింటి అల్లుడు, ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు, నడిరోడ్డులో ఏం చేశాడంటే ?, మొత్తం పోయే!

బెంగళూరు: బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రసాద్ బిద్దప్ప దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కుమారుడు ఆడమ్ బిద్దప్పపై మూడో సారి పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతను మరింత చిక్కుల్లో పడ్డారు. ముస్లిం మతానికి చెందిన ఓ పోలీసు అధికారిని మతం పేరుతో కించపరిచి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడని ఆడమ్ బిద్దప్పపై కేసు నమోదైంది.

గత వారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆదామ్‌పై మద్యం తాగి వాహనాలు నడపడం, రోడ్డుపై సామాన్య ప్రజల మీద విరుచుకుపడ్డాడని కేసు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆదామ్ పోలీసు అధికారి మతాన్ని దూషించిన వీడియో వైరల్‌గా మారడంతో దీనికి సంబంధించి మరో కేసు కూడా ఆదామ్ మీద నమోదైంది. ఈ మూడు కేసులు ఒకే సంఘటనకు సంబంధించినవి. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న గౌస్ పాషా (45) అనే ఆయన ఫ్యాషన్ డిజైనర్ ఆదమ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

FIR in Bengaluru against the son of a famous fashion designer who insulted ASI in the name of religion

అక్టోబరు 25వ తేదీ రాత్రి యలహంకలోని రైల్‌వీల్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఆదమ్‌ బిద్దప్ప ప్రమాదకరంగా, నిర్లక్షంగా ఇష్టం వచ్చినట్లు కారు నడుపుతూ రాహుల్‌ అనే వ్యక్తిని అడ్డుకుని అసభ్యపదజాలంతో అతన్ని బూతులు తిట్టాడు. ఓ పోలీసు అధికారి కారు నడుపుతున్న నిందితుడు బిద్దప్ప వద్దకు వెళ్లి మద్యం సేవించి కారు నడపడమే కాకుండా నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావని ప్రశ్నించాడు. ఆ సందర్బంలో నిందితుడు ఆదమ్ బిద్దప్ప పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగాడు.

ఆ సమయంలో ఏఎస్ఐ గౌస్ పాషాని నువ్వు ముస్లింవా మతం పేరుతో అతన్ని దూషించాడు. అంతేకాకుండా మద్యంమత్తులో ఉన్న ఆదమ్ ఏఎస్ఐ గౌస్ పాషాతో పాలు పోలీసులపై ఉమ్మివేస్తున్న దృశ్యం వీడియోలో రికార్డైంది. ఆదమ్ మద్యం తాగి గొడవ చేయడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులో ఆదమ్ అరెస్టు అయ్యాడు.

గతేడాది ఫిబ్రవరి నెలలో ఆదమ్ బిద్దప్ప అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడంటూ ప్రముఖ శ్యాండిల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే కేసులో ఆదమ్ బిద్దప్ప అరెస్టు అయ్యాడు. దివంగత రెబల్ స్టార్ అంబరీష్ కుమారుడు, కన్నడ నటుడు అభిషేక్ అంబరీష్ భార్య అవివా బిద్దప్ప సోదరుడే ఈ ఆదామ్ బిద్దప్ప. మండ్య ఎంపీ సుమలతా కోడలు అవివా బిద్దప్ప సోదరుడు ఆదమ్ బిద్దప్ప పదేపదే రచ్చ చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+