చెన్నైలో అగ్ని ప్రమాదం: బ్యాంకులు క్లోజ్ (వీడియో)
చెన్నై: చెన్నై నగరంలోని ప్యారీ సర్కిల్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్యాంకు సమీపంలోని దాస్ ఇండియా మనీ ఎక్సైంజ్ ప్రయివేట్ లిమిటెడ్ కమర్షియల్ కాంప్లెక్స్ లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ సమీపంలో ఎస్ బీఐ తో పాటు అనేక ప్రయివేట్ బ్యాంకులు ఉన్నాయి.
బ్యాంకుల దగ్గర నగదు డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చెయ్యడానికి వచ్చిన ఖతాదారులు పరుగు తీశారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవ్వరికిగాయాలు కాలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications