మెలానియా ధరించిన జంప్‌సూట్‌కు భారత్‌కు కనెక్షన్ ఏంటి..? ఈ డిజైనర్ ఏం చెబుతున్నారు..?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తొలిరోజు చాలా బిజీగా గడిపారు. డొనాల్డ్ ట్రంప్ అందరి అటెన్షన్ సంపాదించగా.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌పై అందరి కళ్లూ పడ్డాయి. ఇందుకు కారణం ఆమె ధరించిన తెల్లటి జంప్ సూట్. తొలిరోజు పర్యటన మొత్తం మెలానియా ఈ తెల్లటి జంప్ సూట్‌లోనే కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెల్లటి జంప్ సూట్ పై మెలానియా ఓ ఆకుపచ్చ రంగులో బెల్టు టైపులో ఒక వస్త్రాన్ని తన నడుముకు చుట్టారు.
Recommended Video

మెలానియా ట్రంప్ స్వతహాగా ఒక మోడల్. ఆమె తొలినాళ్లలో మోడలింగ్ చేశారు. పలు క్యాలెండర్ ఈవెంట్స్‌కు కూడా మోడలింగ్ చేశారు. అందుకే ఆమె ధరించే ప్రతి డ్రెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక భారత పర్యటన సందర్భంగా తెల్లటి జంప్ సూట్ ధరించిన మెలానియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ డ్రస్‌ను డిజైన్ చేసింది ప్రముఖ ఫ్రాన్స్ డిజైనర్ హర్వ్ పియర్. ఆ డ్రస్సు గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో హర్వ్ పియర్ వివరించారు. డ్రస్‌పై ఉన్న గ్రీన్ కలర్ క్లాత్‌కు భారత్‌కు సంబంధం ఉందని చెప్పారు. దీన్ని గ్రీన్ సిల్క్‌తో తయారు చేయడం జరిగిందన్నారు.

20వ శతాబ్దపు తొలినాళ్లలో దీన్ని రూపొందించడం జరిగిందని హర్వ్ పియర్ చెప్పారు.తనకు అత్యంత ఆప్తులైన మిత్రుల నుంచి దీన్ని సంపాదించినట్లు పియర్ చెప్పారు. ఈ వస్త్రం గ్రీన్ కలర్ సిల్క్‌తో తయారు చేయబడిందని దానిపై బంగారంతో కూడిన త్రెడ్ వర్క్ చేసినట్లు చెప్పారు. ఇదొక వింటేజ్ పీస్‌గా అభివర్ణించారు హర్వ్ పియర్. ఇక మెలానియా ట్రంప్ డ్రెస్‌కు తగ్గట్టుగా లూజ్ హెయిర్‌తో కనిపించారు. ఇదిలా ఉంటే ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా సింపుల్‌గానే కనిపించారు. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ చాలామందిని ఆకట్టుకుంది.
సోమవారం భారత్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు తొలిరోజు పర్యటన మొత్తం ఒకే డ్రెస్‌లో కనిపించారు. డొనాల్డ్ ట్రంప్ బ్లాక్ కలర్ సూట్ ధరించి దానిపై పసుపు కలర్ టైతో కనిపించగా ప్రథమ మహిళ మెలానియా జంప్ సూట్‌తో కనిపించారు. ఇక ఇవాంకా పింక్ కలర్ డ్రెస్‌తో కనిపించారు. మొత్తానికి ట్రంప్ కుటుంబ సభ్యులు భారత పర్యటనలో భాగంగా తొలిరోజున సింపుల్ డ్రెస్సింగ్‌తో హైలైట్‌గా నిలిచారు.
-
ఎల్లుండే.. పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది -
DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..! -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications