సినిమా ట్విస్ట్, పోలీసు, లేడీ పోలీసుకు గుడిలో రెండో పెళ్లి, నిమిషంలో షాక్ ఇచ్చిన ఫస్ట్ భార్య !
చెన్నై/ కడలూరు: యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పోలీసుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు ఓ యువతిని లవ్ చేశాడు. పోలీసు ఆ యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తరువాత యువతి కుటుంబ సభ్యులు రాజీ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అల్లుడికి అమ్మాయి కుటుంబ సభ్యులు భారీ మొత్తంలోనే కట్నకానుకలు ఇచ్చారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు విడిపోయారు. భార్య దూరం కావడంతో లేడీ పోలీసుతో మగ పోలీసు సరసాలు ఆడాడు.
సందట్లే సడేమియా అంటూ పోలీసులు ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు. లేడీ పోలీసుతో గుడిలో పెళ్లి చేసుకుంటున్న మగ పోలీసు మైండ్ బ్లాక్ అయ్యింది. గుడి దగ్గర అతని మొదటి భార్య ప్రత్యక్షం కావడంతో పంచె చేతిలో పట్టుకుని పరుగు తియ్యడం కలకలం రేపింది. తాళి కట్టే సమయంలో భర్త రెండో పెళ్లి ఆపేసిన మొదటి భార్య ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

తమిళనాడులోని కడలూరు జిల్లా కురించిపాడిలో రామ్ కుమార్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పోలీసు శాఖలో రామ్ కుమార్ కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తమిళనాడులోని తిరువారూరు జిల్లా పెరళం పోలీస్ స్టేసన్ లో రామ్ కుమార్ పనిచేస్తున్నాడు. అలప్పాక్‌కు చెందిన సబిత అలియాస్ సబి అనే యువతిని రామ్ కుమార్ ప్రేమించాడు.
కొంతకాలం పాటు ప్రేమికులు రామ్ కుమార్, సబిత హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేశారు. 2019లో రామ్ కుమార్, సబిత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు సంవత్సరాలకే ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ కుమార్, సబితల మధ్య అభిప్రాయభేదాలు ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. గత ఏడాది భార్యాభర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా జీవించడం మొదలుపెట్టారు.
సబితకు తెలియకుండా ఆమె రామ్‌కుమార్ మైలాడుతురై కోర్టులో విడాకుల కేసు వేశాడని సమాచారం. ఆ తర్వాత తిరువెంకాడు ఆలయంలో తన బంధువుల సమక్షంలో తనతో పాటు పనిచేసే తోటి లేడీ పోలీసును వివాహం చేసుకోవాలని రామ్‌కుమార్ నిర్ణయించుకున్నాడు. లేడీ పోలీసుతో కలిసి రామ్ కుమార్ గుడికి వెళ్లి పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

తన భర్త రామ్ కుమార్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న సబిత ఆమె కుటుంబసభ్యులతో కలిసి గుడి దగ్గరకు వెళ్లింది. రెండో పెళ్లి చేసుకుంటున్న రామ్ కుమార్ అతని మొదటి భార్య సబిత, ఆమె కుటుంబ సభ్యులను చూసి షాక్ అయ్యాడు. ఇద్దరూ పోలీసులు అయి ఉండికూడా ఏమీ చెయ్యలేకపోయారు. సబిత గుడిలో గొడవ చెయ్యడంతో ఏం చెయ్యాలో తెలీక రామ్ కుమార్ పంచి చేతిలో పట్టుకుని పెళ్లికూతురి చెయ్యి పట్టుకుని గుడిలో నుంచి బయటకు పరుగుతీశాడు.
లేడీ కానిస్టేబుల్‌తో పాటు అక్కడి నుంచి పారిపోయిన కానిస్టేబుల్ రామ్ కుమార్ తిరువెంగడు పోలీస్ స్టేషన్‌లో తలదాచుకున్నాడు. ఇద్దరు పోలీసులు కావడంతో రామ్ కుమార్ మీద అతని భార్య సబిత తిరువారూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. తన భర్త తనను మోసం చేసి లేడీ పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడని సబిత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కానీస్టేబుల్ రామ్ కుమార్ రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో చివరి నిమిషయంలో అతని మొదటి భార్య పెళ్లి ఆపేయడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications