ఆకాశంలో అద్భుతం: ఒకే వరుసలో ఐదు గ్రహాలు,వారిపై ఎఫెక్ట్..!
అంతరిక్షంలో అద్భుతం జరుగుతుందంటే అందరి కళ్లూ ఆకాశం వైపే ఉంటాయి. గ్రహణాలు వచ్చిన సమయంలో, గ్రహాలు భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో ఇటు శాస్త్రవేత్తలు అటు సామాన్య ప్రజల దృష్టి అంతా ఆరోజు ఆకాశం వైపే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే శనివారం ఆవిష్కృతం అవుతుంది. ఈ వీకెండ్‌లో నింగిలో మరో అద్భుతం కనువిందు చేయనుంది.
ఈ శనివారం అంటే 17 జూన్ 2023న ఆకాశంలో అద్భుతం కనువిందు చేస్తుంది. బుధుడు(Mercury),వరుణుడు(Uranus),బృహస్పతి(Jupiter), ఇంద్రుడు (Neptune),శని(Saturn) గ్రహాలు మొత్తం ఐదు ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇది శనివారం వేకువజామునే అంటే సూర్యోదయంకు ఒక గంట ముందు నింగిలో కనువిందు చేస్తాయి.ఈ అద్భుత ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండానే నేరుగా కళ్లతో వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడాలంటే మాత్రం టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ అవసరం అవుతుందని చెప్పారు. బృహస్పృతి (Jupiter)గ్రహంకు 7డిగ్రీల కింద యురేనస్ గ్రహం ఉండటం వల్ల అది నేరుగా కంటికి కనిపించదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలా గ్రహాలన్నీ ఒకే రాశిలో ఉన్నప్పుడు ఒక క్రమంలో అమరిక జరుగుతుంది. ఇలా గ్రహాలు ఒకే వరుసలో రావడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్తలు మళ్లీ ఇలాంటి సుందర దృశ్యం 2024 ఏప్రిల్ నెలలో ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు.
అప్పుడు 93 డిగ్రీల సెక్టార్‌లో గ్రహాలు ఒక క్రమంగా కనిపిస్తాయని ఆ సమయంలో మరింత దగ్గరగా వస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. ఈ గ్రహాలను వీక్షించేందుకు శనివారం వేకువజామున అనువైన సమయం అని వివరించిన శాస్త్రవేత్తలు.. శని గ్రహం మాత్రం శుక్రవారం అర్థరాత్రి దాటి శనివారం రోజునే కనిపిస్తుందని చెప్పారు. ఈ గ్రహాలన్నీ ఒకే క్రమంలో కనిపించినప్పుడు గురుడు మేషరాశిలో,బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాయి.
ఇదిలా ఉంటే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వాతావరణం కూడా సహకరించాల్సి ఉంటుందని నాసా పేర్కొంది. మంచి వ్యూ కోసం ఆకాశంలో మేఘాలు లేని ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించింది. టెలిస్కోప్, బైనాక్యులర్స్ వెంట ఉంచుకోవడం మంచిదని వీటితో నెప్ట్యూన్ , యురేనస్ గ్రహాలను వీక్షించొచ్చని వివరించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications