కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద: బాలుడు గల్లంతు(వీడియో)

Courtallam waterfalls: తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలోని పాత కుర్తాళం జలపాతం వద్దకు తీవ్రమైన ఎండల నుంచి సేద తీరేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. అయితే, శుక్రవారం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఓ 16 ఏళ్ల బాలుడు వరదలో గల్లంతయ్యాడు.

ఆ బాలుడు తిరునల్వేలికి చెందిన అశ్విన్‌గా గుర్తించారు. పైన ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చినట్లు తెలుస్తోంది. కుర్తాళం జలపాతం ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు కొంత భయానకంగా ఉన్నాయి.

Flash floods at Old Courtallam waterfalls in Tenkasi Teen boy washed away

ఒక్కసారిగా వరద పోటెత్తడంతో జలపాతంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు వరదలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి.

జలపాతం వద్ద భారీ వరద పోటెత్తడంతో ఈ నీరంతా రోడ్లపైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో కుర్తాళం జలపాతంతో స్నానానలను కొద్ది రోజులు నిషేధించారు. కాగా, శనివారం తెన్ కాశీ, తేని, దిండిగల్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తమిళనాడు వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+