Flipkart Big Saving Days sale: ఆగస్ట్ 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్..
అమెజాన్ ఇటీవలే తన రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగష్టు 5 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఇప్పుడు మరో ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో కొనుగోలు చెయ్యోచ్చని పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ ప్లాట్‌ఫారమ్ కొన్ని ప్రసిద్ధ 5G ఫోన్‌లపై భారీ తగ్గింపును అందించనుంది. ఐఫోన్‌లతో పాటు, Samsung Galaxy S22+ కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, Pixel 6a, Samsung Galaxy Z Flip 3 మరిన్ని వంటి ఇతర ఫోన్‌లు కూడా రాయితీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ 5G ఫోన్‌ల యొక్క ఖచ్చితమైన డీల్ ధర రాబోయే రోజుల్లో లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్‌కు ముందు వెల్లడించనున్నారు.

ఈ సేల్ ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. 9 మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ కార్డ్‌పై సూపర్ కాయిన్స్ లభించనున్నాయి. క్రేజీ డీల్స్ పేరున అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.
అయితే ఫోర్ అవర్ డీల్స్ సేల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిచనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, దుస్తులు, ఫర్నిచర్‌లపై 80 శాతం వరకు రాయితీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పింది. టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 75 శాతం, బ్యూటీ, ఫుడ్, టాయ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్లు అందించనున్నట్ల వివరించింది.












Click it and Unblock the Notifications